Tuesday, December 24, 2024

దేశంలోనే వృద్ధ ఏనుగు మృతి

- Advertisement -
- Advertisement -

తేజ్‌పూర్ : దేశం లోనే అత్యంత వృద్ధ ఏనుగు అనారోగ్య కారణాలతో సోమవారం తెల్లవారు జామున మరణించింది. అస్సాం సోనిత్‌పూర్ జిల్లా లోని విలియమ్‌సన్ మేగర్ గ్రూప్‌కు చెందిన టీ ఎస్టేట్‌లో నివసించేది. దీని పేరు బిజులీ ప్రసాద్. వయస్సు 89 ఏళ్లు. వయో భారంతో వచ్చిన అనారోగ్య సమస్యలతో సోమవారం తెల్లవారు జామున 3.30 గంటల ప్రాంతంలో చనిపోయిందని ఎస్టేట్ నిర్వాహకులు తెలిపారు. జంతు ప్రేమికులు, స్థానికులు ఈ విషయం తెలుసుకుని నివాళులు అర్పించారు. ఈ ఏనుగు చిన్న పిల్లగా ఉన్నప్పుడు బార్‌గాంగ్ టీ ఎస్టేట్‌కు తీసుకు వచ్చారు.

బార్‌గాంగ్‌టీ ఎస్టేట్ అమ్మకం అయ్యాక అక్కడ నుంచి ఈ ఎస్టేట్‌కు తరలించారు. టీ ఎస్టేట్‌లో దీనికి రాజవైభవం లభించింది. ప్రముఖ ఏనుగుల వైద్యులు, పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ కౌశల్ కొన్వార్ శర్మ మీడియాతో మాట్లాడుతూ ఇది దేశం లోనే అత్యంత వృద్ధ ఏనుగని పేర్కొన్నారు. సాధారణంగా ఆసియా ఏనుగులు 62 నుంచి 65 ఏళ్ల వరకు జీవిస్తాయని, అయితే దీన్ని జాగ్రత్తగా సంరక్షించడంతో ఇన్నేళ్లు జీవించగలిగిందని చెప్పారు. పదేళ్ల క్రితమే ఈ ఏనుగు దంతాలు ఊడిపోయినప్పటికీ అధిక ప్రొటీన్‌తో కూడిన , ఉడికించిన ఆహారం అందించడంతో దాని జీవన కాలం పెరిగిందన్నారు. రోజుకు 25 కిలోల ఆహారం అందించినట్టు ఎస్టేట్ నిర్వాహకులు తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News