Thursday, December 26, 2024

ఒలెక్ట్రా లాభం 421 శాతం వృద్ధి

- Advertisement -
- Advertisement -

Olectra's profit grew by 421 percent

మనతెలంగాణ/ హైదరాబాద్ : వాటాదారులకు ప్రయోజనం చేకూరుస్తూ… దీర్ఘకాలిక వృద్ధికి బలమైన పునాది సృష్టించుకుని ప్రతిఫలాలను పొందుతున్నామని ఓలెక్ట్రా గ్రీన్‌టెక్ లిమిటెడ్ సంస్థ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కె.వి. ప్రదీప్ అన్నారు. ప్రముఖ ఎలక్ట్రిక్ మొబిలిటీ కంపెనీ ఓలెక్ట్రా గ్రీన్‌టెక్ లిమిటెడ్ సెప్టెంబర్ 2022తో ముగిసిన రెండో త్రైమాసికం, తొలి అర్ధ సంవత్సరానికి ఆడిట్ చేయని ఏకీకృత ఆర్థిక ఫలితాలను శుక్రవారం సంస్థ ప్రకటించింది. ఈ సందర్భంగా ప్రదీప్ మాట్లాడుతూ అన్ని మార్కెట్లలో పటిష్టమైన వృద్ధి, మా ఆపరేటింగ్ మార్జిన్‌లో గణనీయమైన పెరుగుదలతో మంచి ఫలితాలు సాధించడం సంతోషంగా ఉందన్నారు. మా నిబద్ధత.. పనితీరు ప్రతిభకు ఫలితంగా విజయం దక్కిందన్నారు. ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం తొలి అర్ధ సంవత్సరంలో ఓలెక్ట్రా ఆదాయం రూ. 517.4 కోట్లుగా ఉంది, ఇది అంతకు ముందు సంవత్సరం ఇదే కాలంలో రూ. 110.2 కోట్లతో పోలిస్తే 369.4 శాతం పెరిగింది.

ప్రధానంగా ఆరు నెలల్లో 280 ఎలక్ట్రిక్ బస్సుల సరఫరా చేయడంతో ఆదాయం పెరిగిందన్నారు. గతేడాది ఇదే సమయంలో కేవలం 29 బస్సులు మాత్రమే పంపిణి చేశామని గుర్తుచేశారు. పూణే బస్సు కార్యకలాపాల నుంచి ప్రస్తుత అర్ధ సంవత్సరంలో నమోదైన అధిక నిర్వహణ ఆదాయం. గత సంవత్సరం ఇదే కాలంలో రూ. 5.7 కోట్లతో పోలిస్తే పన్ను తర్వాత లాభం 421.1 శాతం వై- o వై ఆధారంగా రూ. 29.9 కోట్లకు పెరిగింది. ఈబిఐటిడిఎ రూ. 20.3 కోట్ల నుంచి 189.4 శాతం పెరిగి రూ. 58.7 కోట్లకు చేరుకుందన్నారు. పన్నుకు ముందు లాభం (పిబిటి) 367 శాతం పెరిగి రూ. 39.4 కోట్లకు చేరుకుందన్నారు. ఈ -బస్ విభాగం 2022 సెప్టెంబర్ 30తో ముగిసిన త్రైమాసికంలో రూ. 468.2 కోట్ల ఆదాయాన్ని నమోదు చేసిందన్నారు. అర్ధ సంవత్సరానికి రూ. 65.4 కోట్లుగా ఉందన్నారు. ఎలక్ట్రిక్ బస్సుల సరఫరా కారణంగా 615.8 శాతం గణనీయంగా వృద్ధి సాధించిందన్నారు. ఇన్సులేటర్ విభాగంలో రూ. 49.1 కోట్ల టాప్‌లైన్‌ను నమోదు చేసిందన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News