- Advertisement -
ఖాట్మండూ : నేపాల్‌లో ప్రధాన మంత్రి కెపి శర్మ ఓలి పదవీచ్యుతులు అయ్యారు. ఆదివారం నేపాల్ పార్లమెంట్‌లో జరిగిన విశ్వాస పరీక్షలో ఓలీ ఓటమి పాలయ్యారు. దీనితో అక్కడ ప్రభుత్వం కుప్పకూలింది. ప్రతినిధుల సభలో అత్యంత కీలకస్థాయిలో బలపరీక్ష నిర్వహణ జరిగింది. పుష్పకమల్ దహాల్ ప్రచండ నాయకత్వపు సిపిఎన్ (మావోయిస్టు సెంటర్) ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరణతో ప్రధాని విశ్వాస పరీక్షకు వెళ్లారు. దిగువ సభలో ప్రత్యేకంగా జరిగిన ఓటింగ్‌లో ఓలికి 93 ఓట్లు వచ్చాయి. అయితే 275 మంది సభ్యుల సభలో కనీసం 136 మంది మద్దతు ఉంటేనే ఓలీ ప్రధానిగా కొనసాగేందుకు వీలుంటుంది. 124 మంది శర్మకు వ్యతిరేకంగా ఓటేశారు. ప్రచండ వర్గీయులు ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు. గత ఏడాది డిసెంబర్ 20 నుంచి నేపాల్‌లో రాజకీయ సంక్షోభం ఉంది.
- Advertisement -