Sunday, January 19, 2025

రాబిన్‌సన్ అరుదైన రికార్డు

- Advertisement -
- Advertisement -

Oliver Robinson(206) double century

లండన్ : పాతికేళ్లు నిండని ఓ యువ బ్యాటర్ క్రికెట్ చరిత్రలో సంచలన ఇన్నింగ్స్ ఆడాడు. ప్రత్యార్థి బౌలర్లను చెడుగుడు ఆడుతూ వన్డేల్లో అరుదైన రికార్డు నెలకొల్పాడు. 6,6,6,4,4,4.. బౌండరీలతో ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఏకంగా డబుల్ సెంచరీ సాధించి హిట్ మ్యాన్ రోహిత్ శర్మ సరసన చేరాడు. ప్రస్తుతం ఇంగ్లాండ్‌లో డొమెస్టిక్ వన్డే టోర్నమెంట్ జరుగుతోంది. ఈ టోర్నీలో భాగంగా ఇటీవల ఒర్సెస్టర్‌షైర్, కెంట్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ఒర్సెస్టర్‌షైర్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 351 పరుగులు చేసింది. మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు కషిఫ్ అలీ(114) సెంచరీతో కీలక ఇన్నింగ్స్ ఆడగా.. బర్నార్డ్(79), వికెట్ కీపర్ బెన్ కాక్స్(59) అర్ధ సెంచరీలతో అతడికి సాయపడ్డారు. వీరు ముగ్గురూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు.

దీంతో ఆ జట్టు భారీ స్కోర్ కెంట్ జట్టు ముందుంచింది. అనంతరం భారీ లక్ష్యచేధనలో భాగంగా బరిలోకి దిగిన కెంట్ జట్టుకు.. ఓపెనర్ బెన్ కాంప్టన్(75) మంచి శుభారంభాన్ని అందించగా.. వన్ డౌన్‌లో వచ్చిన వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ ఒలివర్ రాబిన్‌సన్(206) డబుల్ సెంచరీతో చెలరేగి ఆడాడు. రాబిన్‌సన్ క్రీజులోకి వచ్చిన మొదటి బంతి నుంచే హిట్టింగ్ మొదలు పెట్టాడు. 131 బంతులు ఎదుర్కొన్న రాబిన్‌సన్.. 27 ఫోర్లు, 6 సిక్సర్లతో 206 పరుగులు సాధించాడు. అతడు బౌండరీల రూపంలో 33 బంతుల్లో 144 పరుగులు రాబట్టడం విశేషం. ఒకే ఓవర్‌లో వరుస బౌండరీలతో చెలరేగిన రాబిన్‌సన్ 30 పరుగులు రాబట్టాడు. దీంతో నిర్ణీత 50 ఓవర్లకు 3 వికెట్లు కోల్పోయి 353 పరుగులు సాధించింది. కాగా, రాబిన్‌సన్ డబుల్ సెంచరీ చేసింది డొమెస్టిక్ క్రికెట్‌లో అయినప్పటికీ.. వన్డేల్లో 200 కంటే ఎక్కువ పరుగులు సాధించిన క్లబ్‌లో అతను చేరాడు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News