- Advertisement -
నిజామాబాద్ : హైదరాబాద్‌లో గురువారం ఎమ్మెల్సీ కవితను జిల్లా ఒలింపిక్ సంఘ అద్యక్ష, కార్యదర్శితో పాటు సంఘ సభ్యులు మర్యాద పూర్వకంగా కలిశారు. ఈసందర్భంగా ఎంపికైనా జిల్లా ఒలింపిక్ సంఘానికి శుభాకాంక్షలు తెలుపుతూ జిల్లాలో క్రీడాకారులు జిల్లా, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించే విధంగా ఒలింపిక్ సంఘంకృషి చేయాలన్నారు. కవితను కలిసిన వారిలో జిల్లా ఒలింపిక్ సంఘ అద్యక్షుడు ఈగ సంజీవరెడ్డి, ప్రధాన కార్యదర్శి బొబ్బిలినర్సయ్య, ఉపాధ్యక్షుడు బాజిరెడ్డి జగన్, కోశాధికారి జివి. భూమారెడ్డి, ఈసి సభ్యుడు యాసిన్, రాష్ట్ర సెపక్ తక్రా అద్యక్షుడు నల్లవెల్లి కరుణాకర్‌రెడ్డి, జిల్లా సెపక్ తక్రా ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు గాధారి సంజీవ్‌రెడ్డి, జిల్లా కబడ్డీ కోచ్ మీసాల ప్రశాంత్ కుమార్ హైదరాబాద్ అర్చరి ప్రధాన కార్యదర్శి అరవింద్ తదితరులు ఉన్నారు.
- Advertisement -