Monday, December 23, 2024

సిఎం రేవంత్‌ రెడ్డిని కలిసిన ఒలింపిక్ గోల్డ్ మెడలిస్టు విజయేందర్ సింగ్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: ప్రముఖ బాక్సర్, ఒలింపిక్ గోల్డ్ మెడలిస్టు విజయేందర్ సింగ్ శుక్రవారం సిఎం రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఏఐసిసీ సెక్రటరీ రోహిత్ చౌదరితో కలిసి అర గంట పాటు సమావేశమయ్యారు. 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో విజేందర్ కాంస్య పతకం గెలుచుకున్నాడు. 2009 వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో, 2010 కామన్వెల్త్ గేమ్స్‌లలోనూ కాంస్య పతకాలు గెలుచుకున్నాడు. విజేందర్ సింగ్ కాంగ్రెస్ పార్టీలో చేరి 2019 లోక్ సభ ఎన్నికల్లో దక్షిణ ఢిల్లీ లోక్ సభ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయాడు. దక్షిణ ఢిల్లీ నుంచి బిజెపి గెలువగా, రెండో స్థానంలో ఆమ్ ఆద్మీ పార్టీ నిలిచింది. విజేందర్ సింగ్ మూడో స్థానంలో నిలిచాడు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News