Monday, January 20, 2025

ఒలంపిక్స్ 2024.. క్వార్టర్ ఫైనల్లో భారత ఆర్చరీ జట్లు

- Advertisement -
- Advertisement -

పారిస్: ఫ్రాన్స్ రాజధాని పారిస్ వేదికగా జరుగుతున్న విశ్వ క్రీడలు (ఒలింపిక్స్)లో భారత్ క్రీడల ఆరంభానికి ముందే అదరగొట్టింది. గురువారం జరిగిన ఆర్చరీ పోటీల్లో భారత పురుషులు, మహిళల జట్లు క్వార్టర్ ఫైనల్‌కు చేరుకున్నాయి. పురుషుల ర్యాంకింగ్ రౌండ్‌లో భారత్ 2013 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచి క్వార్టర్ ఫైనల్ బెర్త్‌ను సొంతం చేసుకుది.

భారత్ విజయంలో విజయవాడ ఆర్చర్ బొమ్మదేవర ధీరజ్ కీలక పాత్ర పోషించాడు. ధీరజ్ అసాధారణ ప్రతిభను కనబరిచాడు. 681 పాయింట్లతో వ్యక్తిగత రౌండ్‌లో నాలుగో స్థానాన్ని దక్కించుకున్నాడు. తరుణ్‌దీప్ రాయ్ 674 పాయింట్లు సాధించి తనవంతు పాత్ర పోషించాడు. ప్రవీణ్ జాదవ్ 658 పాయింట్లు సాధించి సత్తా చాటాడు. మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో భారత్ 1347 పాయింట్లు సాధించి రౌండ్ ఆఫ్16లోకి ప్రవేశించింది.

టాప్‌లో నిలిచిన ధీరజ్, అంతిక భకత్ భారత్ తరఫున బరిలోకి దిగనున్నారు. అంతకుముందు మహిళల టీమ్ విభాగంలో కూడా భారత్ క్వార్టర్ ఫైనల్ బెర్త్‌ను దక్కించుకుంది. గురువారం జరిగిన క్వాలిఫికేషన్ రౌండ్‌లో భారత్ నాలుగో స్థానంలో నిలిచి నేరుగా క్వార్టర్ ఫైనల్ బెర్త్‌ను సాధించింది. భారత్ టీమ్ ఈవెంట్‌లో 1983 పాయింట్లను సాధించింది. అంకిత భకత్ (666), భజన్ కౌర్ (658), దీపిక కుమార్ (658) పాయింట్లు సాధించి భారత్ విజయంలో కీలక పాత్ర పోషించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News