Wednesday, January 22, 2025

ఒలింపిక్స్ నిర్వహణ సాధ్యమా?

- Advertisement -
- Advertisement -

ఒలింపిక్స్ నిర్వహణ అంటే ఎంతో ఖర్చుతో, శ్రమతో కూడుకున్న పని. వేల మంది హాజరయ్యే ఈ సంబరానికి ఎన్నో ఏర్పాట్లు అవసరం. కొత్త రహదారులు వేయాలి. ఎయిర్ పోర్ట్, రైల్వే లను ఆధునీకరించాలి. అథ్లెట్స్ కోసం ఒలింపిక్ విలేజి నిర్మించాలి. వేల మందికి హోటళ్ల సౌకర్యం కావాలి. ఈ జులైలో ఒలింపిక్స్ నిర్వహించడానికి పారిస్ 8 బిలియన్ యూరోలను ఖర్చు చేసింది. అంటే రూ.75 వేల కోట్లు అన్నమాట. అయితే ఏ దేశమైన ప్రతిష్ట కోసమే ఇదంతా చేస్తోంది తప్ప పెట్టిన పైసా తిరిగి వస్తుందని కాదు. వీటి నిర్వహణ ద్వారా ఆర్థికంగా దెబ్బ తిన్న సందర్భాలు కూడా ఉన్నాయి. 1976 లో వీటి ఏర్పాట్ల కోసం మాంట్రియల్ (కెనెడా) చేసిన అప్పు తీరడానికి 30 ఏళ్ళు పట్టిందట. దక్షిణ అమెరికా దేశాల్లో తొలి సారిగా 2016 లో ఈ ఆటలు నిర్వహించిన బ్రెజిల్ అప్పులపాలైంది. ఆటలు అయిపోయాక స్టేడియంల నిర్వహణ కోసం ఏటా కోట్లు ఖర్చు చేయవలసి వస్తోంది. బీజింగ్ లోని పిట్ట గూడు లాంటి స్టేడియం కోసం చైనా ఏటా కోటి డాలర్లు వెచ్చిస్తోంది.

మన క్రీడాకారులు పారిస్ ఒలింపిక్స్ లో పాల్గొనేందుకు వెళ్లేముందు జులై 24 న ప్రధాని నరేంద్ర మోడీ వారితో సుమారు గంట సేపు సమావేశమయ్యారు. పరీక్షలు రాయబోతున్న విద్యార్థులను ఉపాధ్యాయుడు అడిగినట్లు వారి సంసిద్ధత గురించి ఎన్నో విషయాలు అ డిగి తెలుసుకున్నారు. మీలో చిన్న వయసు వాళ్లెవరు, మొదటి సారి వెళుతున్న వారెవరు, మళ్లీ వెళుతున్న వారెవ రు, ఓటమి నుంచి ఏం నేర్చుకున్నారు, పతకం సాధించిన వారి ప్రస్తుత లక్ష్యమేమిటి.. లాంటి ఎన్నో ప్రశ్నలు వారిని అడిగారు. వారి జవాబులను ఓపిగ్గా, ఉత్సాహంగా విన్నా రు. మీ సర్వ శక్తులు పెట్టి ఆడండి.. గెలుపు అందకుంటే నిరాశ పడకండి. గెలిచే విధానం నేర్చుకొని రండి. భయం, బెరుకు వదిలి ఆత్మవిశ్వాసంతో పాల్గొనండి అని వారికి ఎంతో ధైర్యాన్ని అందించారు. పారిస్ లో 27 జులై నుండి 9 ఆగస్టు వరకు జరిగిన ఒలింపిక్ క్రీడల్లో మన దేశం నుండి 117 మంది ఆటగాళ్లు 16 రకాల పోటీల్లో పాల్గొని 6 పతకాలతో తిరిగి వచ్చిన సంగతి తెలిసిందే.

అయితే ఆనాడు క్రీడాకారులతో మాట్లాడుతూ ప్రధా ని తన మనసులోని ఓ కొత్త మాటను వారితో పంచుకున్నా రు. మన దేశం ఇప్పుడు అన్ని రంగాలతో పాటు ఆర్థికంగా అభివృద్ధి చెందుతోంది. 2036 నాటికి మన దేశం ఒలింపిక్ క్రీడలకు ఆతిథ్యమిచ్చే అవకాశం కూడా ఉంది అని ధీమాగా చెప్పారు. 2028 లో లాస్ ఏంజెల్స్ లో జరగబోయే క్రీడల్లో చివరి రోజున ఫలానా చోట మళ్లీ కలుద్దాం అంటూ 2032 ఒలింపిక్స్ సిటీని ప్రకటిస్తారు. ఇప్పటికి ఉన్న సమాచారాన్ని బట్టి 2032 క్రీడలు ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్ నగరంలో జరుగుతాయని తెలుస్తోంది. ఐ ఓ సి జులై 2021 లో జరిగిన సభ్య సమావేశంలో ఈ విషయా న్ని ప్రకటించింది. ఆ సమాచారం అందిన వెంటనే ఆస్ట్రేలియా ఏర్పాట్ల పనిలో పడింది. ఇప్పటికే స్టేడియంల కో సం స్థలాల ఎంపిక, కట్టడాలు కావలసిన సిబ్బంది, నిధుల ఏర్పాట్లు కూడా జరిగిపోయాయి. అయితే 2036 లో ఒలింపిక్ క్రీడలు ఎక్కడ నిర్వహిస్తారు అనేది ఇంకా నిర్ణ యం కాలేదు. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో కూడా 15 ఆగష్టు నాడు మోడీ ఎర్రకోట నుండి చేసిన ప్రసంగంలో 2036 లో భారత్ ఒలింపిక్స్ కి వేదిక కావాలని తన ఆ కాంక్షని ప్రకటించారు. కేంద్ర క్రీడల శాఖా మంత్రి మన్సు ఖ్ మాండవియా కూడా లోక్ సభలో ఒక ప్రశ్నకు జవాబు గా మన దేశంలో ఒలింపిక్స్ నిర్వహణ కోసం భారత ఒ లింపిక్స్ సంఘం ద్వారా ఒలింపిక్స్ కమిటీతో సంప్రదింపులు జరుపుతోందని అన్నారు.

ఒలింపిక్స్ కి అతిథ్యదేశంగా ఉంటామని మనమే అంటే సరిపోదు. ఐ ఓ సి లో ఉన్న 111 సభ్యులు తమ ఓటింగ్ ద్వారా ఎంపిక చేస్తారు. నిర్వహిస్తామని ముందు కు వచ్చిన దేశాల మధ్య ఈ పోటీ జరుగుతుంది. 2032 లో ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్ లో నిర్వహణకు 72 మంది అనుకూలంగా స్పందించారు. మన దేశం నుండి ఐ ఓ సి మెంబర్‌గా ముఖేష్ అంబానీ భార్య నీత అంబానీ 2016 నుండి కొనసాగుతున్నారు. పారిస్ ఒలింపిక్స్ సమయం లో ఆమె సభ్యత్వాన్ని మరోసారి పొడిగించారు. ఐ ఓ సి ప్రతినిధుల నిర్ణయాన్ని ఆమె ఏమేరకు ప్రభావితం చేసి మ నకు నిర్వహించే అవకాశాన్ని సాధిస్తారో ఇప్పుడే చెప్పలేం.

ఒలింపిక్స్ నిర్వహణ అంటే ఎంతో ఖర్చుతో, శ్రమతో కూడుకున్న పని. వేల మంది హాజరయ్యే ఈ సంబరానికి ఎన్నో ఏర్పాట్లు అవసరం. కొత్త రహదారులు వేయాలి. ఎయిర్ పోర్ట్, రైల్వే లను ఆధునీకరించాలి. అథ్లెట్స్ కోసం ఒలింపిక్ విలేజి నిర్మించాలి. వేల మందికి హోటళ్ల సౌక ర్యం కావాలి. ఈ జులైలో ఒలింపిక్స్ నిర్వహించడానికి పారిస్ 8 బిలియన్ యూరోలను ఖర్చు చేసింది. అంటే రూ.75 వేల కోట్లు అన్నమాట. అయితే ఏ దేశమైన ప్రతిష్ట కోసమే ఇదంతా చేస్తోంది తప్ప పెట్టిన పైసా తిరిగి వస్తుందని కాదు. వీటి నిర్వహణ ద్వారా ఆర్థికంగా దెబ్బ తిన్న సందర్భాలు కూడా ఉన్నాయి. 1976 లో వీటి ఏర్పాట్ల కోసం మాంట్రియల్ (కెనెడా) చేసిన అప్పు తీరడానికి 30 ఏళ్ళు పట్టిందట. దక్షిణ అమెరికా దేశాల్లో తొలి సారిగా 2016లో ఈ ఆటలు ని ర్వహించిన బ్రెజిల్ అప్పులపాలైంది. ఆటలు అ యిపోయాక స్టేడియంల నిర్వహణ కోసం ఏ టా కోట్లు ఖర్చు చేయవలసి వస్తోంది. బీజింగ్ లోని పిట్ట గూడు లాంటి స్టేడియం కోసం చైనా ఏటా కోటి డాలర్లు వెచ్చిస్తోంది.

ఈ లెక్కన మన దేశం ఇంకా ఒలింపిక్స్ నిర్వహణ స్థాయికి ఎదగలేదనే అనాలి. 2050 దాకా ఆ ఆలోచన పక్కన పెట్టాలని ఈ వార్త తెలిసిన వెంటనే సోషల్ మీడియాలో కొందరు పోస్టులు పెట్టారు. పతకాల విషయానికొస్తే మనం చాలా వెనుకబడి ఉన్నాం. కనీసం 40 పతకాలు సాధించే సా మర్థ్యం ఉంటే తప్ప నిర్వహణ జోలికి వెళ్లవద్దని భారత ఒలింపియన్ అభినవ్ బింద్రా అంటున్నారు. ఒలింపిక్స్ నిర్వహణ ఆలోచన ఉంటే ముందు క్రీడాకారుల పరిస్థితి మెరుగుపడాలి. పతకాల జాబితాలో కొన్ని దేశాలు ముం దట ఉన్నాయంటే అవి క్రీడాకారుల కోసం ఇస్తున్న నిధులే కారణం. గత సంవత్సరం జపాన్ తమ అథ్లెట్స్ కోసం రూ. 10 వేల కోట్లు ఖర్చు చేసింది. చైనా రూ. 26 వేల కో ట్లు కేటాయించాయి.

ఆటగాళ్ల చదువులు, పనులు పక్కన పెట్టించి అధునాతన సామగ్రితో, సమర్థులైన కోచ్ లతో ప్రాక్టీసు చేయించాయి. మన దగ్గర ఎవరికి తంటాలు వా రు పడాల్సిందే. ఒలింపిక్స్ తయారీ కోసం కేంద్రం గత నా లుగేళ్లుగా ఏడాదికి రూ.250 కోట్ల కేటాయింపు జరుగుతోంది. పారిస్ ఒలింపిక్స్‌లో పాల్గొనే వారి కోసం ప్రభు త్వం రూ.470 కోట్లు ఆటలకు నెల రోజుల ముందు విడుదల చేసింది. ఈ నేపథ్యంలో మన ఆటగాళ్లు చూపించిన ప్రదర్శనను అభినందించాల్సిందే. 84 దేశాలు పాల్గొన్న పారిస్ ఒలింపిక్స్ లో పతకాల సాధనలో మన స్థానం 48 నుండి 71కి జారింది. మన జనాభా లెక్కన చూస్తే 80 లక్షల మందిలో ఒకరు ఈ క్రీడల్లో పాల్గొనగా 23 కోట్లలో ఒకరికి మెడల్ వచ్చినట్లు భా వించాలి. 12.5 కోట్ల జనాభా ఉన్న జ పాన్ ఈ క్రీడల్లో 45 పతకాలు గెలుచుకుంది. ఇన్ని ప్రతికూలతల మధ్య మనం 2036లో ఒలింపిక్ జ్యోతిని మెరిపించ డం దేశానికి ఏ మేరకు మేలు చేస్తుంది అనేది జవాబు అవసరమైన ప్రశ్న.

బి.నర్సన్
94401 28169

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News