- Advertisement -
శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ, శ్రీ హర్ష కొనుగంటి, యువి క్రియేషన్స్ , వి సెల్యులాయిడ్ కాంబినేషన్‌లో మోస్ట్ అవైటెడ్ మూవీ ఓం భీమ్ బుష్…ఈనెల 22న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్‌కి సిద్ధంగా ఉంది, ఓవర్సీస్ , కొన్ని ఇతర ప్రాంతాలలో 21న ప్రీమియర్లు ప్రదర్శించబడతాయి. ఈలోగా ఈ చిత్రం సెన్సార్ ను పూర్తి చేసుకొని ’యు/ఎ’ సర్టిఫికేట్‌ను అందుకుంది. ‘ఓం భీమ్ బుష్’ పర్ఫెక్ట్ సమ్మర్ ఔటింగ్, ఇది యూత్ అండ్ ఫ్యామిలీ ఆడియన్స్‌ను సమానంగా ఆకట్టుకోనుంది. కాలేజ్ లో బ్యాంగ్ బ్రోస్ ఫన్ ధమాకాతో సినిమా ప్రారంభమవుతుంది, ఆ తర్వాత భైరవపురం గ్రామంలో క్రేజీ రైడ్ ఉంటుంది. ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు, సినిమా చివరలో భారీ ఎమోషన్‌తో ఊహించని ట్విస్ట్‌లతో అద్భుతంగా వుంటుంది. సినిమాలో హై ఎంటర్ టైన్ మెంట్ తో పాటు కాన్సెప్ట్ చాలా కొత్తగా ఉంటుంది.
- Advertisement -