Wednesday, January 22, 2025

అక్రమ ఆస్తుల కేసులో ఓం ప్రకాష్ చౌతాలాకు నాలుగేళ్ల జైలు శిక్ష

- Advertisement -
- Advertisement -
Om Prakash Chautala
ఓం ప్రకాష్ చౌతాలా హర్యానా ముఖ్యమంత్రిగా పని చేసిన కాలంలో అక్రమ స్థిర, చరాస్తులను కూడబెట్టారని సిబిఐ పేర్కొంది.

న్యూఢిల్లీ: ఆదాయానికి మించిన ఆస్తుల (డీఏ) కేసులో హర్యానా మాజీ ముఖ్యమంత్రి ఓం ప్రకాశ్ చౌతాలాకు ఢిల్లీలోని సిబిఐ ప్రత్యేక కోర్టు శుక్రవారం నాలుగేళ్ల జైలు శిక్ష విధించింది. చౌతాలా (87)కి రూ.50 లక్షల జరిమానా విధించిన కోర్టు, అతని నాలుగు ఆస్తులను జప్తు చేయాలని కూడా సిబిఐని ఆదేశించింది.

2005లో చౌతాలాపై సిబిఐ కేసు నమోదు చేసింది. 1993 మరియు 2006 మధ్య కాలంలో చౌతాలా రూ. 6.09 కోట్ల విలువైన ఆస్తులను కూడబెట్టారని ఆరోపిస్తూ ఏజెన్సీ మార్చి 26, 2010న ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. చౌతాలా 1989 మరియు 2005 మధ్య నాలుగుసార్లు హర్యానా ముఖ్యమంత్రిగా పనిచేశారు.

సిబిఐ ప్రకారం, జూలై 24, 1999 నుండి మార్చి 5, 2005 వరకు హర్యానా ముఖ్యమంత్రిగా పనిచేసిన కాలంలో, తన కుటుంబ సభ్యులు, ఇతరులతో కుమ్మక్కై ఆస్తులు, స్థిర , చరాస్తులు కూడ బెట్టారు.  అవన్నీ అతని పేరు మీద, అతని కుటుంబ సభ్యుల పేర్ల మీద ఉన్నాయి. మే 2019లో, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ న్యూఢిల్లీ, పంచకుల మరియు సిర్సాలలో ఉన్న మాజీ ముఖ్యమంత్రికి చెందిన రూ. 3.6 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేసింది.

జనవరి 2013లో, ఓం ప్రకాష్ చౌతాలా,  అతని కుమారుడు అజయ్ సింగ్ చౌతాలాలకు ఐపిసి , అవినీతి నిరోధక చట్టంలోని వివిధ నిబంధనల ప్రకారం కోర్టు పదేళ్ల జైలు శిక్ష విధించింది. 3,000 మంది అర్హత లేని ఉపాధ్యాయులను అక్రమంగా నియమించినందుకు చౌతాలా దోషిగా తేలారు.  జూలై 2, 2021న తీహార్ జైలు నుండి పేరోల్ పై విడుదలయ్యారు. ఇదిలావుండగా  చౌతాలా మనవడు దుష్యంత్ చౌతాలా హర్యానాలో బిజెపి,  బిజెపి పాలక కూటమి ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News