Sunday, January 19, 2025

ఐర్లాండ్‌కు ఒమన్ షాక్

- Advertisement -
- Advertisement -

బులవాయో: వరల్డ్‌కప్ క్వాలిఫయర్ మ్యాచుల్లో ఒమన్ సంచనలం నమోదు చేసింది. సోమవారం జరిగిన గ్రూప్‌బి మ్యాచ్‌లో ఒమన్ ఐదు వికెట్ల తేడాతో ఐర్లాండ్‌పై సంచలన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఐర్లాం 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 281 పరుగులు చేసింది. తర్వాత లక్షఛేదనకు దిగిన ఒమన్ 48.1 ఓవర్లలోనే ఐదు వికెట్లు మాత్రమే కోల్పోయి విజయాన్ని అందుకుంది. బ్యాటర్లు సమష్టిగా రాణించడంతో ఒమన్ చిరస్మరణీయ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది.

ఓపెనర్ కశ్యప్ ప్రజాపతి 6 ఫోర్లు, సిక్సర్‌తో 72 పరుగులు చేశాడు.వన్‌డౌన్‌లో వచ్చిన అఖిబ్ ఇలియాస్ (52), కెప్టెన్ జిషాన్ మక్సూద్ (59), మహ్మద్ నదీమ్ 46 (నాటౌట్), అయాన్ ఖాన్ (21), షోయబ్ ఖాన్ 19 (నాటౌట్) అద్భుత బ్యాటింగ్‌తో ఒమన్ విజయంలో కీలక పాత్ర పోషించారు. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్‌ను డాక్రెల్ ఆదుకున్నాడు. కీలక ఇన్నింగ్స్ ఆడిన డాక్రెల్ ఏడు ఫోర్లు, రెండు సిక్సర్లతో 91 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. హారి టెక్టర్ (52), వికెట్ కీపర్ టక్కర్ (26), డెలానే (20) తమవంతు సహకారం అందించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News