Monday, December 23, 2024

విపక్ష ఇండియా కూటమిలో విభేదాలు దురదృష్టకరం : ఒమర్ అబ్దుల్లా

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : విపక్ష ఇండియా కూటమి విభేదాలతో నీరుగారడం దురదృష్టకరమని నేషనల్ కాన్ఫరెన్స్ వైస్ ప్రెసిడెంట్ , జమ్ముకశ్మీర్ మాజీ సిఎం ఒమర్ అబ్దుల్లా ఆవేదన వ్యక్తం చేశారు. విపక్ష కూటమిలో అంతర్గత విభేదాలు తలెత్తుతున్నాయని, ప్రస్తుతం ఇండియా కూటమి బలంగా లేదని వ్యాఖ్యానించారు. ఎన్నికలు జరిగే నాలుగైదు రాష్ట్రాల్లో కూటమి భాగస్వామ్య పక్షాల మధ్య బేధాభిప్రాయాలు వాంఛనీయం కాదని పేర్కొన్నారు. సమాజ్ వాదీ పార్టీ, కాంగ్రెస్‌ల మధ్య విభేదాలున్నాయని, యూపీలో ఇరు పార్టీలు అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని చెప్పడం ఇండియా కూటమికి మేలు చేయబోదని అన్నారు. రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తరువాత తాము మరోసారి భేటీ అవుతామని , అన్ని అంశాలపై చర్చలు సాగిస్తామని చెప్పారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News