Saturday, January 11, 2025

‘భారత్ జోడో యాత్ర’లో చేరిన ఒమర్ అబ్దుల్లా

- Advertisement -
- Advertisement -

బనిహాల్: నేషనల్ కాన్ఫరెన్స్ నాయకుడు ఒమర్ అబ్దుల్లా శుక్రవారం బనిహాల్ వద్ద ‘భారత్ జోడో యాత్ర’లో కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘రాహుల్ గాంధీ నిర్వహిస్తున్న ఈ పాదయాత్ర ఆయన ఇమేజ్ పెంచుకోడానికి కాదు, దేశంలో పరిస్థితులను మార్చడానికి చేస్తున్నది’ అన్నారు. జమ్మూకశ్మీర్ ప్రత్యేక హోదాపై కాంగ్రెస్ వైఖరి ఎలా ఉంటుందన్న దానిపై తాను మాట్లాడుకోదలచుకోలేదని ఆయన స్పష్టంచేశారు. దేశం ఇమేజ్ కోసమే తాను ఈ యాత్రలో పాల్గొన్నానని ఒమర్ అబ్దుల్లా తెలిపారు.

రాహుల్ గాంధీ ఈ యాత్రను వ్యక్తిగత కారణాల వల్ల చేపట్టలేదు, దేశంలో మైనారిటీలను టార్గెట్ చేస్తుండడం, మత కల్లోలాలు సృష్టించడానికి జరుగుతున్న కుట్ర కారణంగానే ఆయన ఈ యాత్ర చేపట్టారన్నారు. ‘ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ అరబ్ దేశాలతో స్నేహం చేస్తోంది, కానీ ప్రభుత్వంలో మైనారిటీలకు ప్రాతినిధ్యమే లేదు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి నేటి వరకు ఇప్పుడే పార్లమెంటులో అధికార పార్టీకి ఒక్క మైనారిటీ సభ్యుడు కూడా లేడు. లోక్‌సభలో, రాజ్యసభలో ఒక్క ముస్లిం సభ్యుడు కూడా లేడు. ఇది అధికారంలో ఉన్న పార్టీ వైఖరిని చాటుతోంది’ అన్నారు. ‘370 ఆర్టికల్‌ను పునరుద్ధరించేందుకు తాము ప్రయత్నం చేస్తామన్నారు. పిటిషన్ల విచారణ జరపడానికి కూడా ప్రభుత్వం వెనుకడుగు వేస్తోంది. అంటే మా వాదన గట్టిగా ఉందని అర్థం’ అన్నారు. ‘ఎన్నికలు నిర్వహించాల్సిందిగా జమ్మూకశ్మీర్ ప్రజలు దేబురించేలా చేయాలనుకుంటోంది ప్రభుత్వం. కానీ మేము అడుక్కునే వాళ్లం కాదు’అని ఆయన చెప్పుకొచ్చారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News