Sunday, December 22, 2024

సుదీర్ఘ పోరాటానికి సిద్ధంగా ఉన్నాం: ఒమర్ అబ్దుల్లా

- Advertisement -
- Advertisement -

శ్రీనగర్: జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించిన ఆర్టికల్ 370 రద్దు సక్రమమేనని పేర్కొంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై బిజెపి నేతలు హర్షం వ్యక్తం చేస్తుండగా కశ్మీర్‌కు చెందిన నేతలు మాత్రం సుప్రీంకోర్టు తీర్పు తమకు తీవ్ర నిరాశను కలిగించిందని పేర్కొన్నారు. నేషనల్ కాన్ఫరెన్స్ ఉపాధ్యక్షుడు , రాష్ట మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా సుప్రీంకోర్టు తీర్పుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

‘ తీర్పుతో అసంతృప్తితో ఉన్నాం. కానీనిరాశపడడం లేదు. ఆర్టికల్ 370ని రద్దే చేయడానికి బిజెపికి కొన్ని దశాబ్దాలు పట్టింది. మేం కూడా సుదీర్ఘ పోరాటానికి సిద్ధమవుతున్నాం.దీనిపై మా పోరాటం కొనసాగుతుంది’ అని ఒమర్ అబ్దుల్లా ఒక ట్వీట్‌లో పేర్కొన్నారు. ఆశను కోల్పోరాదని పేర్కొంటూ ప్రముఖ కవి ఫౌజ్ అహ్మద్ ఫౌజ్ రాసిన ఓ కవితను కూడా ఆయన ఉదహరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News