Wednesday, January 22, 2025

వ్యతిరేకించే కుటుంబాల తోనే బిజెపికి సమస్య : ఒమర్ అబ్దుల్లా

- Advertisement -
- Advertisement -

వంశరాజకీయాలతో బీజేపీకి సమస్యలేదని, ఆ పార్టీని వ్యతిరేకించే కుటుంబాలతోనే సమస్యలని నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా గురువారం వ్యాఖ్యానించారు. బీహార్‌లో చిరాగ్ పాశ్వాన్‌తో బీజేపీ పొత్తుపెట్టుకుందని, మహారాష్ట్రలో పొత్తు కోసం రాజ్‌థాకరేతో కేంద్రమంత్రి అమిత్‌షా మంతనాలు జరుపుతున్నారని, గ్వాలియర్‌లో జ్యోతిరాదిత్య సిందియా కుటుంబానికి చెందిన అభ్యర్థి గుణ నుంచి పోటీ చేయడం లేదా ?ఇవన్నీ కుటుంబ రాజకీయాలకు ఉదాహరణ కాదా ? అరి ఆయన ప్రశ్నించారు. వంశరాజకీయాలతో బీజేపీకి ఎలాంటి సమస్య లేదని, ఆ పార్టీని వ్యతిరేకించే కుటుంబాల తోనే సమస్యలని, తాను మాత్రం బీజేపీని వ్యతిరేకిస్తానని గర్వంగా చెప్పుకుంటానని అబ్దుల్లా విలేఖర్ల సమావేశంలో వ్యాఖ్యానించారు. కశ్మీర్ లోని మూడు లోక్‌సభ స్థానాలకు నేషనల్ కాన్ఫరెన్స్ అభ్యర్థులను రంగం లోకి దింపడం లేదా అన్న ప్రశ్నకు తగిన సమయంలో పేర్లు ప్రకటిస్తామని చెప్పారు.

తమ నియోజకవర్గాలకు మూడు,, నాలుగు, ఐదు దశల్లో ఎన్నికలు జరగనున్నాయని, అందువల్ల చాలా సమయం ఉందన్నారు. బీజేపీ నేత చౌదరి లాల్ సింగ్‌ను కాంగ్రెస్ వెనక్కు తీసుకోవడంపై అడగ్గా అది కాంగ్రెస్ అంతర్గత వ్యవహారమని పేర్కొన్నారు. లాల్‌సింగ్ 2018లో ఎనిమిదేళ్ల బాలికపై అత్యాచారం కేసులో నిందితులకు మద్దతు ఇచ్చిన వ్యక్తి. 2014 లోక్‌సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌ను విడిచిపెట్టి బీజేపీలో చేరారు. ఇప్పుడు లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడానికి కథువా నుంచి కాంగ్రెస్ టికెట్ ఆశిస్తున్నారు. ఒకవేళ కాంగ్రెస్ అభ్యర్థిగా లాల్‌సింగ్ పోటీ చేస్తే ఇండియా కూటమిలో భాగస్వామి అయిన నేషనల్ కాన్ఫరెన్స్ సింగ్‌కు మద్దతు ఇవ్వవలసి ఉంటుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News