Saturday, June 29, 2024

లోక్‌సభ స్పీకర్‌గా ఓంబిర్లా

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ: లోక్ సభ స్పీకర్ బిజెపి ఎంపి ఓంబిర్లా ఎన్నికయ్యారు. ఎన్‌డిఎ తరపున ఓంబిర్లా రెండో సారి లోక్ సభ స్పీకర్‌గా ఎన్నికయ్యారు. ఇండియా కూటమి అభ్యర్థిపై ఎన్‌డిఎ కూటమి అభ్యర్థి గెలుపొందారు. లోక్ సభ స్పీకర్‌పై పదవిపై పాలక పక్షం, విపక్షాల మధ్య ఏకాభ్రిపాయం లేకపోవడంతో ఎన్నిక ప్రక్రియను చేపట్టారు. ఎన్‌డిఎ తరుఫున ఓం బిర్లా, ఇండియా కూటమి తరపున కె సురేష్ పోటీ చేశారు. ఓంబిర్లా పేరును ప్రతిపాదిస్తూ ప్రధాని నరేంద్రమోడీ తీర్మానం ప్రవేశ పెట్టారు. ఈ తీర్మానాన్ని ఎన్‌డిఎ ఎంపిలు బలపరిచారు. ఇండియా కూటమి తరపున కె సురేష్ పేరును శివసేన ఎంబిటి ఎంపి అరవింద్ సావంత్ తీర్మానం ప్రవేశపెట్టడంతో ఆ కూటమి ఎంపిలు బలపరిచారు. మూజువాణీ ఓటింగ్ చేపట్టడంతో ఓం బిర్లా విజేతగా నిలిచినట్లు ప్రొటెం స్పీకర్ భర్తృహరి మహతాబ్ వెల్లడించారు. ఓం బిర్లాను సభాపతి స్థానం వద్దకు ప్రధాని నరేంద్ర మోడీ, రాహుల్ గాంధీ తీసుకెళ్లి స్పీకర్ సీట్లో కూర్చోబెట్టారు. 2024 లోక్ సభ ఎన్నికలలో రాజస్థాన్‌లోని కోట నుంచి ఆయన ఎంపిగా గెలిచారు. కోట నుంచి ఇప్పటికే ఆయన మూడు సార్లు ఎంపిగా విజయం సాధించారు. మరోసారి స్పీకర్‌గా ఎన్నికైన ఓంబిర్లాకు ప్రధాని నరేంద్ర మోడీ శుభాభినందనలు తెలిపారు. వచ్చే ఐదేళ్లు సభ్యులందరికీ మార్గదర్శనం చేస్తారని విశ్వాసం ఉందన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News