Saturday, November 23, 2024

ఢిల్లీలో ఒమిక్రాన్ కొత్త వేరియంట్ అలజడి

- Advertisement -
- Advertisement -

Omicron BA 2.75 variant found in Delhi

న్యూఢిల్లీ: ఢిల్లీలోని కొవిడ్ రోగుల నమూనాల్లోని మెజారిటీ నమూనాల్లో ఒమిక్రాన్ కొత్త ఉప వేరియంట్ బీఎ 2.75 బయటపడినట్టు లోక్‌నాయక్ జైప్రకాశ్ నారాయణ్ ఆస్పత్రి అధికారులు వెల్లడించారు. ఈ నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపామని, ఈ వారంలో వాటిని విశ్లేషించడమౌతుందని మెడికల్ డైరెక్టర్ డాక్టర్ సురేశ్ కుమార్ తెలిపారు. అనుమానంతో 90 మంది నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపగా, ఒమిక్రాన్ ఉపవేరియంట్ బీఏ 2.75ను గుర్తించామని, టీకాలు తీసుకున్నవారిపైనా, యాంటీబాడీలు ఉన్నవారిపైనా ఈ ఉపవేరియంట్ ప్రభావం చూపుతుందని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. గత రెండు వారాలుగా ఢిల్లీలో కొవిడ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఆగస్టు 1 నుంచి 10 వరకు 19,760 కేసులు నమోదయ్యాయి. ఇదికాక నగరం లోని కంటైన్‌మెంట్ జోన్లలో దాదాపు 50 శాతం వరకు పెరిగాయి. బుధవారం ఢిల్లీలో 2146 కేసులు నమోదు కాగా, కరోనాతో ఎనిమిది మంది మృతి చెందారు. పాజిటివిటీ రేటు 17.83 శాతానికి చేరడం ఆందోళన కలిగిస్తోంది. కేసులను పరిశీలిస్తే 180 రోజుల తరువాత ఇదే అత్యధిక సంఖ్య. మంగళవారం 2945 కేసులుతో 15.4 శాతం పాజిటివిటీ రేటు నమోదైంది. ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. ముఖ్యమంత్రి కేజ్రీవాల్ మంగళవారం ఢిల్లీలో కరోనా కేసులు పెరుగుతున్నా ఆందోళన చెందాల్సిన పనిలేదని, ఇవన్నీ తేలికపాటి లక్షణాలవేనని చెప్పారు.
ఢిల్లీలో మాస్క్ తప్పనిసరి.. లేదంటే రూ.500 జరిమానా
ఢిల్లీలో మాస్క్‌ను తప్పనిసరి చేస్తూ డీడీఎంఎ (డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఢిల్లీ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ) ఉత్తర్వులు జారీ చేసింది. వ్యక్తిగత కార్లలో మినహా ప్రతిచోటా మాస్క్ ను తప్పనిసరిగా ధరించాల్సిందేనని, ప్రైవేట్ వాహనాల్లో ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలని హెచ్చరించింది. మాస్క్ నిబంధన ఉల్లంఘించిన వారిపై రూ. 500 జరిమానా విధించనున్నట్టు ఆదేశాల్లో పేర్కొంది. ఏప్రిల్ నెలలో జరిగిన మీటింగ్‌లో తీసుకున్న నిర్ణయాలను జిల్లా పాలనా యంత్రాంగాలు అమలు చేయాలని స్పష్టం చేసింది.

Omicron BA 2.75 variant found in Delhi

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News