- Advertisement -
జెనీవా : ప్రస్తుతం 89 దేశాలకు ఒమిక్రాన్ వేరియంట్ వ్యాపించిందని, సామాజిక వ్యాప్తితో మూడు రోజుల్లోనే కేసులు రెట్టింపు అయ్యాయని ప్రపంచ ఆరోగ్యసంస్థ శనివారం వెల్లడించింది. జనాభాలో అత్యధిక స్థాయిల్లో ఇమ్యూనిటీ ఉన్న దేశాల్లో కూడా ఇది వేగంగా విస్తరిస్తోందని, ఇమ్యునిటీని తప్పించుకునే సామర్ధం దీనికి ఉండడం వల్ల వ్యాపిస్తోందా లేక దాని స్వాభావిక వ్యాప్తి లక్షణం పెంపొందడం వల్లనా అన్నది స్పష్టం కావడం లేదని ప్రపంచ ఆరోగ్యసంస్థ తాజాగా అభిప్రాయపడింది. మొట్టమొదట ఇది బయటపడినప్పుడే ఒమిక్రాన్ ఆందోళన కలిగించే వేరియంట్‌గా నవంబర్ 26 న ప్రపంచ ఆరోగ్యసంస్థ గుర్తించింది. ఇది ఎంతవరకు తీవ్ర అస్వస్థత కలిగిస్తుందో తదితర లక్షణాలేవీ ఇప్పటికీ తెలియరావడం లేదని పేర్కొంది. వైద్యపరంగా దీని తీవ్రత గురించి పరిమిత సమాచారమే తమ వద్ద ఉందని డబ్లుహెచ్‌ఒ తెలియచేసింది.
- Advertisement -