న్యూఢిల్లీ : దేశంలో ప్రస్తుతం 16 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఒమిక్రాన్ వ్యాపించింది. ఈ వేరియంట్ బాధితుల సంఖ్య ఇప్పటివరకు 236 కు చేరిందని గురువారం కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. అలాగే 104 మంది కోలుకున్నారని పేర్కొంది. అత్యధికంగా మహారాష్ట్రలో 65 మంది ఒమిక్రాన్ బారిన నడగా, ఢిల్లీ ఆ సంఖ్య 64 కి చేరింది. తెలంగాణలో 24,కర్ణాటకలో 19, రాజస్థాన్‌లో 21, కేరళలో 15 వరకు బాధితులు ఉన్నారు. గురువారం ఉదయం 8 గంటల వరకు అందిన వివరాల ప్రకారం కొత్తగా 7495 కరోనా కేసులు బయటపడగా, దేశం మొత్తం మీద కేసుల సంఖ్య 3,47,65,976 కు చేరింది. క్రియాశీల కేసుల సంఖ్య 78,291 కి పెరిగింది. తాజాగా 434 మంది మరణించడంతో మొత్తం మృతుల సంఖ్య 4,78,759 కి చేరింది. గత 56 రోజులుగా రోజువారీ కేసుల సంఖ్య 15,000 దిగువకు నమోదవుతోంది. మొత్తం ఇన్‌ఫెక్షన్లలో క్రియాశీల కేసుల రేటు 0.23 శాతంగా ఉండగా, రికవరీ రేటు 98.40 శాతంగా నమోదైంది. తాజాగా మృతి చెందిన వారిలో కేరళలో 383 మంది, మహారాష్ట్ర, తమిళనాడు, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లో మొత్తం 8 మంది మృతి చెందారు.
దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 236 కు చేరిక
- Advertisement -
- Advertisement -
- Advertisement -