- Advertisement -
ఢిల్లీ: భారత్‌లో రోజు రోజుకు ఒమిక్రాన్ వేరియంట్ వేగంగా వ్యాపిస్తోంది. ఇప్పటి వరకు దేశంలో 236 మంది ఒమిక్రాన్ సోకిందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. మహారాష్ట్ర(65), ఢిల్లీ(64) ఒమ్రికాన్ కేసుల సంఖ్య ఎక్కువగా ఉండడంతో క్రిస్మస్, నూతన సంవత్సర వేడకలపై ఆ ప్రభుత్వాలు ఆంక్షలు విధించాయి. దేశ వ్యాప్తంగా 7495 మందికి కరోనా వైరస్ సోకగా 434 మంది మృత్యువాతపడ్డారు. ఇప్పటి వరకు కరోనా కేసుల సంఖ్య 3.47 కోట్లకు చేరుకోగా 4,78,759 మంది చనిపోయారు. కరోనా నుంచి 3.47 కోట్ల మంది కోలుకోగా 78,921 మంది చికిత్స తీసుకుంటున్నారు. 139.6 కోట్ల డోసులు పంపిణీ చేశామని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
- Advertisement -