- Advertisement -
ఢిల్లీ: దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య నాలుగు వేలు దాటింది. ఇప్పటివరకు మొత్తంగా 4,033 మంది కొత్త వేరియంట్ ఒమిక్రాన్ బారిన పడినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. అత్యధికంగా మహారాష్ట్రలో 1216 ఒమిక్రాన్ కేసులు రాగా, రాజస్థాన్‌లో 529, ఢిల్లీలో 513 , కర్ణాటకలో 441 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు 1552 మంది ఒమిక్రాన్ బాధితులు కోలుకున్నట్టు ఆరోగ్యశాఖ తెలియజేసింది.
151 కోట్లు దాటిన వ్యాక్సినేషన్
మరోవైపు దేశంలో టీకా పంపిణీకి సంబంధించి ఆదివారం 29.60 లక్షల మందికి టీకాలు వేశారు. ఇప్పటివరకు 151.94 కోట్ల డోసులను పంపిణీ చేసినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. కరోనా తీవ్రత నేపథ్యంలో ఈ ఏడాది వ్యాక్సినేషన్ ను మరింత విస్తరించిన విషయం తెలిసిందే.
- Advertisement -