- Advertisement -
మహారాష్ట్రలో 167, ఢిల్లీలో 165
న్యూఢిల్లీ: మంగళవారం ఉదయానికి దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 653కు చేరిందని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. వీరిలో 186మంది కోలుకున్నారని తెలిపింది. మహారాష్ట్రలో 167, ఢిల్లీలో 165, కేరళలో 57, తెలంగాణలో 55, గుజరాత్‌లో 49, రాజస్థాన్‌లో 46, తమిళనాడులో 34, కర్నాటకలో 31,ఆంధ్రప్రదేశ్‌లో 6 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. 24 గంటల్లో కొత్తగా నమోదైన మొత్తం కేసుల సంఖ్య 6358 కాగా, కోలుకున్నవారి సంఖ్య 6450. మరణాల సంఖ్య 293. క్రియాశీల కేసుల సంఖ్య 75,456. యాక్టివ్ కేసుల రేట్ 0.22గా నమోదైంది. గతేడాది మార్చి నెల తర్వాత ఇదే కనిష్ఠం. కోలుకున్నవారి సంఖ్య 3,42,43,945. రికవరీ రేట్ 98.40గా నమోదైంది. రోజువారీ పాజిటివిటీ రేట్ 0.61. ఇది 85 రోజుల కనిష్ఠం. వారం పాజిటివిటీ 0.64. ఇది 44 రోజుల కనిష్ఠం. దేశంలో మొత్తం కేసుల సంఖ్య 3,47,99,691, మరణాల సంఖ్య 4,80,290కి చేరింది.
- Advertisement -