హైదరాబాద్: హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్ వద్ద ప్రతి ఆదివారం ఏర్పాటు చేస్తున్న సండే ఫన్ డే కార్యక్రమంపై ఒమిక్రాన్ ఎఫెక్ట్ పడింది. ప్రపంచవ్యాప్తంగా ఆందోళనకరంగా మారిన కరోనా ఒమిక్రాన్ వేరియంట్ ఇప్పటికే భారత్‌లోకి ప్రవేశించిన విషయం విదితమే. ఆ భయం హైదరాబాద్‌ను పట్టుకుంది. దీంతో ఒమిక్రాన్ వ్యాప్తి చెందకుండా తీసుకుంటోన్న చర్యల్లో భాగంగా ఆదివారం ట్యాంక్‌బండ్‌పై నిర్వహించాల్సినప సండే ఫన్ డే కార్యక్రమాన్ని రద్దు చేశారు. అంతేకాదు ప్రతి ఆదివారం చార్మినార్ వద్ద నిర్వహిస్తున్న ఏక్ శామ్ చార్మినార్ కే నామ్ కార్యక్రమాన్ని రద్దు చేశారు.ఈ మేరకు పురపాలకశాఖ ప్రత్యేక ప్రధానకార్యదర్శి అరవింద్‌కుమార్ ఓ ప్రకటన చేశారు. పరిస్థితులు బాగుంటే భవిష్యత్తులో మళ్లీ యథావిధిగా నిర్వహిస్తామని తెలిపారు. కాగా, హెచ్‌ఎండిఎ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సండ ఫన్ డే కార్యక్రమానికి ప్రజలు పెద్ద ఎత్తున తరలివస్తోన్న విషయం విదితమే. ప్రతి ఆదివారం నిర్వహించే ఆ కార్యక్రమం కోసం ట్యాంక్‌బండ్ వద్ద పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తారు.
ఒమిక్రాన్ ఎఫెక్ట్: హైదరాబాద్‌లో సండే ఫన్‌డే రద్దు
- Advertisement -
- Advertisement -
- Advertisement -