లండన్ : కొత్త వేరియంట్ ఒమిక్రాన్ మరిన్ని దేశాలకు విస్తరించింది. దక్షిణాఫ్రికా లో మొదట బయటపడిన ఈ వేరియంట్ జాడలు శనివారం అనేక ఐరోపా దేశాల్లోనూ కనిపించాయి. బ్రిటన్, జర్మనీ, ఇటలీల్లో కొత్త వేరియంట్ కేసులు బయటపడ్డాయి. బెల్జియం, ఇజ్రాయెల్, హాంకాంగ్ దేశాల్లో కొందరు ప్రయాణికుల్లో ఈ వేరియంట్ బయటపడింది. ఆస్ట్రేలియాలో ఇద్దరికి, నెదర్లాండ్స్‌లో 13 మందికి, ఈ వైరస్ సోకినట్టు తేలింది. ఒమిక్రాన్ వ్యాప్తితో బ్రిటన్ సహా అనేక దేవాలు మాస్కులు వంటి నిబంధనలను కట్టుదిట్టం చేయడంతోపాటు , అంతర్జాతీయ ప్రయాణాలపై ఆంక్షలు విధించాయి. బ్రిటన్‌లో కొవిడ్ టీకా బూస్టర్ డోసును ప్రారంభిస్తున్నట్టు ప్రధాని బోరిస్ జాన్సన్ తెలిపారు. ఇప్పటికే దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా, లెసోతో, ఏస్వటినా , బోట్స్‌వానాల నుంచి ప్రయాణికుల రాకపోకలపై నిషేధం విధించిన బ్రిటన్ , ఆదివారం అంగోలా, మలావి, మొజాంబిక్ , జాంబియాలను కూడా ఆ జాబితాలో చేర్చింది.
మరిన్ని దేశాలకు విస్తరించిన ఒమిక్రాన్
- Advertisement -
- Advertisement -
- Advertisement -