Tuesday, November 26, 2024

సామాజిక వ్యాప్తి స్థాయికి ఒమిక్రాన్

- Advertisement -
- Advertisement -
Omicron in community transmission in India
ఇన్సాకాగ్ వెల్లడి

న్యూఢిల్లీ: సార్స్‌కోవ్ 2 వైరస్ వేరియంట్ అయిన ఒమిక్రాన్ మన దేశంలో సామాజిక వ్యాప్తి స్థాయికి చేరుకుందని జన్యుక్రమాన్ని విశ్లేషించే సంస్థల కన్సార్టియం (ఇన్సాకాగ్) తెలిపింది. ఢిల్లీ, ముంబయి నగరాల్లో ఈ వేరియంట్ ప్రబలంగా ఉందని తెలిపింది. విదేశీ ప్రయాణికులనుంచి వ్యాపించే దానికన్నా దేశీయంగా అంతర్గత వ్యాప్తి అధికంగా ఉన్నట్లు అంచనా వేసింది.‘ వ్యాక్సిన్ తీసుకున్న ప్రయాణికుల్లో తొలుత ఒమిక్రాన్ వేరియంట్‌ను గుర్తించడం జరిగింది. ఈ వేరియంట్ సోకినా ప్రస్తుతం చాలా మందిలో ఈ లక్షణాలు బహిర్గతం కావడం లేదు. అంటే అసింప్టమాటిక్ అన్న మాట. మరి కొందరిలో స్వల్ప లక్షణాలు మాత్రమే కనిపిస్తున్నాయి. అయితే టీకా తీసుకోని హై రిస్క్ ఉన్న వారిలోనూ ఇటువంటి తక్కువ ప్రభావాన్నే చూపుతుందని భావించడం సరికాదు’ అని ఇన్సాకాగ్ హెచ్చరించింది. వ్యాప్తి తీవ్రత ఎక్కువగా ఉన్నా ఆస్పత్రుల్లో చేరాల్సిన అవసరం తక్కువేనని, ప్రాణాపాయ ముప్పుకూడా స్వల్పమేనని పేర్కొంది. అంతమాత్రాన ఒమిక్రాన్‌ను నిర్లక్షం చేయడం తగదని, తగు రక్షణ విధానాలను పాటించడం, టీకా తీసుకోవడం ఈ రెండే ఈ వైరస్‌నునుంచి రక్షించే ప్రధాన రక్షణ కవచాలని స్పష్టం చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News