Friday, December 20, 2024

ఒమిక్రాన్ ఎంఆర్‌ఎన్‌ఎ బూస్టర్ వ్యాక్సిన్ ప్రారంభం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ శనివారం కొవిడ్ వేరియంట్ ఒమిక్రాన్ నివారణ కోసం ఒమిక్రాన్ ఎంఆర్‌ఎన్‌ఎఆధారిత బూస్టర్ వ్యాక్సిన్‌ను ప్రారంభించారు. జెమ్ కొవాక్ ఒమ్ అనే ఈ వ్యాక్సిన్ భారత దేశానికి చెందిన మొట్టమొదటి ఎంఆర్‌ఎన్‌ఎ ఆధారిత వ్యాక్సిన్. స్వదేశీ సాంకేతికతతో జెన్నోవా దీన్ని అభివృద్ధి చేసింది. డిపార్ట్‌మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ (డిబిటి), బయోటెక్నాలజీ ఇండస్ట్రీ రీసెర్చి అసిస్టెన్స్ కౌన్సిల్ (బిఐఆర్‌ఎసి) నిధులు సమకూర్చాయి. సాధారణ ఉష్ణోగ్రతల స్థాయిలో ఈ వ్యాక్సిన్ నిల్వ చేయవచ్చు. అలాగే దేశంలో ఎక్కడికైనా రవాణా చేయవచ్చు . సూది, సిరంజీ అవసరం లేకుండా ఈ ఇంజెక్షన్‌ను ఇవ్వవచ్చని మంత్రి జితేంద్ర సింగ్ ఈ సందర్భంగా వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News