Friday, November 1, 2024

డెల్టా కంటే ఒమిక్రాన్ వ్యాప్తి 4.2 రెట్లు ఎక్కువ

- Advertisement -
- Advertisement -

టోక్యో: డెల్టా వేరియంట్ కంటే ఒమిక్రాన్ 4.2 రెట్లు ఎక్కువ వేగంతో వ్యాపిస్తున్నట్టు తేలింది. క్యోటో విశ్వవిద్యాలయంలో ఆరోగ్య పర్యావరణ శాస్త్రాల ప్రొఫెసర్ హిరోషి నిషియురా దక్షిణాఫ్రికా గౌటెంగ్ ప్రావిన్స్‌లో నవంబర్ వరకు అందుబాటులో ఉన్న జన్యు సమాచారాన్ని విశ్లేషించి ఈ విషయాన్ని వెల్లడించారు. వేగంగా వ్యాప్తి చెందడమే కాకుండా సహజ వ్యాక్సిన్ల ద్వారా సమకూరిన రోగ నిరోధక శక్తినీ ఇది తప్పించుకుంటుందని నిషియురా విశ్లేషించారు. ఈ సమాచారాన్ని ఆయన దేశ ఆరోగ్యమంత్రిత్వశాఖ సలహా మండలికి సమర్పించారు. ఆరోగ్యశాఖకు సలహాదారుగా ఉన్న ఆయన, గణిత సూత్రాల ఆధారంగా అంటువ్యాధుల వ్యాప్తి అంచనాలో నిపుణుడు. దక్షిణాఫ్రికాలో టీకా రేటు 30 శాతం కంటే తక్కువగా ఉంది. దీంతో అక్కడ చాలా మందికి సహజం గానే వైరస్ సోకి ఉంటుంది. అయితే అధిక వ్యాక్సినేషన్ రేటు ఉన్న దేశాల్లోనూ ఇలాగే జరుగుతుందా ? అని తేలేందుకు మరికొంత సమయం పడుతుందని నిషియురా చెప్పారు.

Omicron spread 4.2 times more than delta

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News