Monday, December 23, 2024

ఢిల్లీలో కరోనా పెరుగుదలకు అదే కారణమా?

- Advertisement -
- Advertisement -

Omicron sub-variant BA.2.12 found in Delhi samples

సగానికి పైగా శాంపిల్స్‌లో కనిపించిన బిఎ.2.12 సబ్ వేరియంట్

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కరోనా ఉధృతి మరోసారి కలవరపెడుతున్న విషయం తెలిసిందే. పాజిటివిటీ రేటు కూడా అయిదు శాతానికి పెరిగింది. ఈ నేపథ్యంలో వైరస్ ఉదృతికి కారణాలను అన్వేషించడానికి జీనోమ్ సీక్వెన్సింగ్‌ను ముమ్మరం చేశారు. ఏప్రిల్ తొలి రెండు వారాల్లో నమోదయిన పాజిటివ్ నమూనాల్లో ఒమిక్రాన్ సబ్ వేరియంట్ అయిన ‘బిఎ.2.12 రకం వేరియంట్ అధికంగా ఉన్నట్లు గుర్తించారు. దీంతో ఢిల్లీలో కరోనా వ్యాప్తి పెరుగుదలకు ఈ వేరియంటే కారణం కావచ్చని అనుమానిస్తున్నారు. ఢిల్లీలో ఇటీవల పెరుగుతున్న కేసులకు సంబంధించి ఇండియన్ సార్స్‌కోవ్2 జీనోమిక్స్ కన్సార్టియం(ఇన్సాకాగ్) ఎప్పటికప్పుడు సమీక్షిస్తోంది. ఇందులో భాగంగా ఏప్రిల్ తొలి 15 రోజుల్లో 300కు పైగా నమూనాలను సీక్వెన్సింగ్ చేపట్టింది. 52 శాతం నమూనాల్లో బిఎ.2.12 సబ్ వేరియంట్ వెలుగు చూడగా 11 శాతం శాంపిల్స్‌లో బిఎ.2.10 కనిపించినట్లు తేలింది.60 శాతానికి పైగా ఉన్న ఈ రెండు ఉపరకాల వల్లే ఢిల్లీలో వైరస్ వ్యాప్తి అధికంగా ఉండవచ్చని అంచనా వేసింది.

ఒమిక్రాన్ (బిఎ.2)తో బిఎ.2.12 ఉపరకం 30నుంచి 90 శాతం వేగంగా వ్యాప్తిచెందే అవకాశం ఉందంటున్నారు. మరోవైపు మొత్తం జీనోమ్ సీక్వెన్సింగ్ చేపట్టిన నమూనాల్లో ఒమిక్రాన్‌నుంచి ఉత్పన్నమైన మరోకొత్త రకం బిఎ.2.12.1కూడా కనిపించినట్లు సమాచారం. అమెరికాలో ఇటీవల కేసుల పెరుగుదలకు కారణమైన ఈ వేరియంట్‌ను ఇంకా ప్రభుత్వ వర్గాలు ధ్రువీకరించలేదు. కాగా పొరుగు రాష్ట్రాలయిన ఉత్తరప్రదేశ్, హర్యానాలలో సీక్వెన్సింగ్ చేసిన శాంపిల్స్‌లో కూడా దాదాపుగా ఇవే సబ్ వేరియంట్లు కనిపించాయని అధికారులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా ఢిల్లీలో బుధవారం ఒక్క రోజే 1009 కొత్త కేసులు వెలుగు చూశాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News