Saturday, January 18, 2025

కలవరపెడుతున్న కొత్త వేరియంట్

- Advertisement -
- Advertisement -

Omicron Sub Variant Cases in Maharashtra

వెలుగులోకి ఒమిక్రాన్ సబ్ వేరియంట్
మహారాష్ట్రలో పెరుగుతున్న కేసులు
రాబోయే రెండువారాలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక
న్యూఢిల్లీ: దేశంలో ప్రస్తుతం కరోనా వైరస్ అదుపులోనే ఉంది. గత కొన్ని రోజులుగా రోజువారీ కేసులు రెండు వేల సమీపంలోనే నమోదవుతున్నాయి. మరో వైపు ప్రజలంతా కూడా పండగల ఉత్సాహంలో ఉన్నారు. అయితే ఇదే సమయంలో వెలుగులోకి వచ్చిన ఒమిక్రాన్ సబ్ వేరియంట్ ‘ఎక్స్‌బిబి’ వైద్య వర్గాలను అందోళనకు గురి చేస్తోంది. మహారాష్ట్రలో గత వారంతో పోలిస్తే కొత్త కేసులు 17.7 శాతం పెరిగాయి. అందుకు ఈ ఎక్స్‌బిబి సబ్ వేరియంట్‌ను కారణంగా చూపిస్తున్నారు. చలికాలం, పండగల సీజన్ ఉండడంతో ఈ వేరియంట్ వ్యాప్తి అధికంగా ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. బిఎ 2.75, బిజె.1 రకాలు కలిసి ఈ ఎక్స్‌బిబి సబ్ వేరియంట్ ఏర్పడినట్లు వైద్యనిపుణులు వెల్లడించారు. మహారాష్ట్రతో పాటుగా దీనిని ఇప్పటికే పశ్చిమ బెంగాల్, ఒడిశా, తమిళనాడులలో గుర్తించారు. ఈ ఆగస్టులోనే సింగపూర్, అమెరికాలో ఇది వెలుగులోకి వచ్చింది. దీనికి బిఎ 2.75 కన్నా ఎక్కువ వేగంతో వ్యాప్తి చెందే లక్షణం, రోగ నిరోధక శక్తిని ఏమార్చే గుణం ఉన్నట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది.ఎక్స్‌బిబితో పాటుగా మొదటిసారిగా మహారాష్ట్రలో బిఎ.2.3.20,బిక్యు.1 రకాలను కూడా గుర్తించారు. ఇక ప్రస్తుతం కేసుల పెరుగుదల ఆ రాష్ట్రంలో జన సాంద్రత ఎక్కువగా ఉన్న ఠాణె, రాయ్‌గడ్, ముంబయిలో కనిపించింది. ఈ నేపథ్యంలో రాబోయే రెండువారాలు అప్రమత్తంగా ఉండాలని, ఫ్లూ లాంటి లక్షణాలు కనిపిప్తే వెంటనే పరీక్షలు చేయించుకోవాలని రాష్ట్ర వైద్య శాఖ ఓ బులెటిన్‌లో ప్రజలను హెచ్చరించింది. అంతేకాకుండా ప్రజలను కలుసుకునే విషయంలో కూడా గతంలో కొవిడ్ సమయంలో తీసుకున్న తరహా జాగ్రత్తలు పాటించాలని ఆ బులెటిన్ సూచించింది.

Omicron Sub Variant Cases in Maharashtra

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News