Wednesday, January 22, 2025

భారత్‌లో ఒమిక్రాన్ బీఏ. 4, బీఏ. 5 వేరియంట్లు…

- Advertisement -
- Advertisement -

omicron subvariants in india

న్యూఢిల్లీ : దక్షిణాఫ్రికా తదితర దేశాల్లో వ్యాపించిన ఒమిక్రాన్ ఉపవేరియంట్టు బీఏ 4,బీఏ 5 లు భారత్‌లో గుర్తించినట్టు ఇండియన్ సార్స్ కోవ్2 జీనోమిక్స్ కన్సార్టియం (ఇన్సాకాగ్) వెల్లడించింది. తమిళనాడు, తెలంగాణల్లో ఈ కేసులు బయటపడినట్టు తెలిపింది. తమిళనాడుకు చెందిన 19 ఏళ్ల యువతిలో ఒమిక్రాన్ బిఏ 4 ను గుర్తించామని ఇన్సాకాగ్ తాజా బులెటిన్‌లో పేర్కొంది. ఆ బాధితురాలికి స్వల్ప లక్షణాలు మాత్రమే ఉన్నాయని , ఆమె వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకొన్నట్టు తెలిపింది. తెలంగాణలో 80ఏళ్ల బీఏ 5 బయటపడినట్టు స్పష్టం చేసింది. అతడి లోనూ స్వల్ప లక్షణాలే ఉన్నాయని, పూర్తి స్థాయిలో వ్యాక్సినేషన్ చేయించుకున్నట్టు పేర్కొంది. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఇరువురు బాధితుల కాంట్రాక్ట్ ట్రేసింగ్‌ను చేపట్టినట్టు కేంద్ర వైద్యారోగ్యశాఖ తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News