Friday, November 22, 2024

2022లో ఒమిక్రాన్‌దే ఆధిపత్యం

- Advertisement -
- Advertisement -

Omicron will dominate In 2022

అంత్యదశను ఇప్పుడే అంచనా వేయలేం:  సింగపూర్ వైద్య నిపుణులు

సింగపూర్: 2022లో ప్రపంచంలో ఒమిక్రాన్ ఆధిపత్య(డామినెంట్) స్ర్టైన్‌గా మనగలుగుతుందని సింగపూర్ వైద్యనిపుణులు అంచనా వేశారు. డెల్టా వేరియంట్‌కన్నా వేగంగా వ్యాప్తి చెందడంతోపాటు వ్యాక్సిన్లను తప్పించుకునేలా తయారైందని వారు తెలిపారు. మరోవైపు కరోనా మహమ్మారికి 2022లో చరమగీతం పాడాలని ప్రపంచ ఆరోగ్యసంస(డబ్లూహెచ్‌ఒ)్థ పిలుపునిచ్చింది. డబ్లూహెచ్‌ఒ పిలుపును గుర్తు చేస్తూ.. మహమ్మారి అంత్యదశను అంచనా వేయాలంటే ఒమిక్రాన్‌కు సంబంధించి మరింత డేటాను సేకరించాల్సి ఉన్నదని సింగపూర్ వైద్య నిపుణులు అంటున్నారు. పెరుగుతున్న కేసులు, ఆస్పత్రుల్లో చేరికలతో ఒమిక్రాన్ వల్ల జరిగే నష్టం పట్ల ఇంకా స్పష్టత లేదని సింగపూర్ ప్రజా ఆరోగ్య నిపుణురాలు నటాషా హోవార్డ్ అన్నారు.

తమ దేశ ప్రజలకు బూస్టర్ డోస్ అవసరమని ఆమె అన్నారు. డెల్టా వేరియంట్‌కన్నా ఒమిక్రాన్ వల్ల రీ ఇన్‌ఫెక్షన్లు ఐదు రెట్లు అధికమని ఆమె తెలిపారు. ప్రజా ఆరోగ్య నిపుణులు ఈ వేరియంట్‌పై వ్యాక్సిన్లు ఏమేరకు పని చేస్తున్నాయన్నదానిపై మూల్యాంకనం చేస్తున్నారని , ఫలితాల కోసం ఎదురు చూస్తున్నామని ఆమె తెలిపారు. 1918లో వచ్చిన ఫ్లూ మహమ్మారి పూర్తిగా అంతం కాలేదని అమెరికా వ్యాధుల నియంత్రణ కేంద్రం(సిడిసి) చెబుతోందని మరో నిపుణులు, సింగపూర్ మేనేజ్‌మెంట్ యూనివర్సిటీ అసోసియేట్ డైరెక్టర్ డాక్టర్ లిమ్‌వీకియట్ గుర్తు చేశారు. శతాబ్దం దాటినా ఫ్లూ ఇంకా వస్తూనే ఉన్నదని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News