Thursday, January 23, 2025

ఆగస్టు 13న యాదవ యుద్ధభేరి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : రాష్ట్రంలోని 24 యాదవ సంఘాల నాయకులు సమన్వయ కమిటీగా ఏర్పడి పార్టీలకు అతీతంగా రానున్న తెలంగాణ ఎన్నికలలో జనాభా నిష్పత్తి ప్రకారం 22 సీట్లు ప్రకటించాలని యాదవ విద్యావంతుల వేదిక రాష్ట్ర అధ్యక్షులు చలగాని వెంకట్ యా దవ్ డిమాండ్ చేశారు. శుభం కన్వెన్షన్ లో ఆదివారం జరిగిన యాదవ విద్యావంతుల వేదిక నిర్వహించిన రౌండ్ టేండ్ సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగిం చా రు. జనగణన కుల గణన ఆధారంగా జరగాలని జనాభా నిష్పత్తి ప్రకారం యాదవులే చైర్మన్గా యాదవ కార్పొరేషన్ ఏర్పాటు చేసి బడ్జెట్ కేటాయించాలని, యాదవులకు సంబంధించిన సంఘాలన్నీ సమస్యల పరిష్కారం కోసం కోఆర్డినేషన్ కమిటీగా ఏర్పడి ఆగస్టు 13న హైదరా బాదులో లక్షలాది మంది యాదవులతో శక్తి ప్రదర్శన చేసి యాదవ యుద్ధభేరి మోగించాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.

రాష్ట్రంలోని అన్ని ప్రధాన పార్టీల నాయకులను ఆహ్వానించి వారిపైఒత్తిడి చేసి మనం అనుకున్న లక్ష్యాన్ని సాధించడానికి సమావేశంలో భాగస్వామ్యమైన ప్రతి ఒక్క సంఘం ప్రతి ఒక్క నాయకులు బాధ్యతలని భుజాన వేసుకొని సైనికులుగా సమరానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు సమావేశంలో అఖిల భారత యాదవ మహాసభ జాతీయ ప్రధాన కార్యదర్శి ఆర్ లక్ష్మణ్ యాదవ్ ,కోకాపేట శ్రీకృష్ణ యాదవ ట్రస్ట్ చైర్మన్ చింతల్ రవీందర్ యాదవ్ , రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పోచబోయిన శ్రీహరి యాదవ్ ,వర్రే వెంకటేశ్వర్లు యాదవ్, మాజీ సమాచార కమిషనర్, ప్రముఖ సినీనటి కరాటే కళ్యాణ్ యాదవ్, లాస్య ఇన్ఫోటెక్ మేనేజింగ్ డైరెక్టర్, ఓ రుగంటి వెంకటేశ్వర్లు యాదవ్, యాదవ హక్కుల పోరాట సమితి శెట్టి వంశీ మోహన్ యాదవ్, భారత యాదవ సమితి దాసరి నగేష్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News