Monday, December 23, 2024

22న లోయర్ ట్యాంక్‌బండ్ కట్టమైసమ్మ తల్లికి కుమ్మరుల తొలిబోనం

- Advertisement -
- Advertisement -

సిటీ బ్యూరో: తెలంగాణ రాష్ట్ర కుమ్మర సంఘం ఆద్వర్యంలో ఈ నెల 22న లోయర్ ట్యాంక్ బండ్‌లోని కనకాల కట్ట మైసమ్మకు తొలిబోనం జాతర నిర్వహించునున్నారు. అమ్మవారికి రాష్ట్ర కుమ్మర సం ఘం తరుపున తొలి బోనం సమర్పించనున్న ఈ జాతరకు రాష్ట్ర వ్యాప్తంగా వున్న కుమ్మరి బందువులు వేలాదిగా తరలిరావాలని రాష్ట్ర అధ్యక్షులు నడికుడ జయంత్ రావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్కాజ్‌గిరి దయానంద్ విజ్జప్తి చేశారు.

మంగళవారం కుమ్మర సంఘం రాష్ట్ర సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమస్త సమాజం కుండల లోనే గ్రామ దేవతలకు బోనం ఎక్కించాలని, గ్రామ దేవతలకు కుమ్మరుల ద్వా రానే బోనము సమర్పించాలని కోరారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా కులాలకు మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ కుండలలో నీళ్లు మట్టి పాత్రలోనే వంటలు చేసుకోవాలని ఎలాంటి రోగాలు రాకుండా ఈ పాత్రలు సహాయ పడతాయనితెలిపారు. ఈ సమావేశంలో అసోసియేట్ అద్యక్షులు కుమ్మరి లక్ష్మి నారాయణ , ఉత్సవ కమిటీ చైర్మన్ నిమ్మలూరి శ్రీనివాస్, ఉ పాధ్యక్షులు వీరేశమ్, కార్యదర్శి నాగపురి నాగేష్, గుండాల గోవర్ధన్, చంద్రయ్య, రాదారపు లక్ష్మి, యంజాల సుజాత, దర్గ స్వరూప, జయమ్ము, శ్యామ్ కుమార్, మల్కాజ్‌గిరి యాదయ్య, జిల్లేల శంకర్, మల్కాజ్‌గిరి సుభాష్, యర్నెల్లి శంకర్ మోహన్, కుమార్, మల్లేశ్ శంకర్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News