Wednesday, January 22, 2025

26న పలువురికి తెలంగాణ ఉద్యమ వీర పురస్కారాల ప్రదానం

- Advertisement -
- Advertisement -

కాచిగూడ : శ్రుతిలయ ఆర్ట్ అకాడమీ, సీల్‌వెల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో సీల్‌వెల్ సినీ సుస్వరాలు-,37 శీర్షికతో ఈనెల 26న సోమవారం మధ్యాహ్నం 3నుంచి రాత్రి 10గంటల వరకు త్యాగరాయగానసభలో తెలంగాణ దశాబ్ది వేడుకలను ఘనంగా నిర్వహించనున్నారు. ఈ మేరకు సీల్‌వెల్ కార్పొరేషన్ అధినేత బండారు సుబ్బారావు, శ్రుతిలయ చైర్మన్ బొక్కా భీమ్‌రెడ్డి శనివారం ఒక ప్రక టనలో తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న టిజివో, టిఎన్‌జీవో నేతలతో పాటు పలువురికి ఉద్యోగ ఉద్యమ వీర పురస్కారాలతో సత్కరిం చనున్నట్లు వారు వివరించారు.

పురస్కార గ్రహీతలు కె.స్వామిగౌడ్, దేశపతి శ్రీనివాస్, కె.దేవిప్రసాద్, రవీందర్‌రెడ్డి, మమత, సత్య నారాయణ, మామిళ్ల రాజేం దర్ పలువురు ప్ర ముఖులను పురస్కారాలు అందుకోనున్నారు. ముఖ్యఅతిథిగా తెలంగాణ ప్లానింగ్ బోర్డు కమీషన్ చైర్మన్ బి.వినో ద్ కుమార్ హాజరవగా పోలీస్ హౌసింగ్ బోర్డు కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ గుప్తా సభాధ్యక్షత వహించ నున్న కార్యక్రమంలో సినీ దర్శకులు బొమ్మకు మురళీ, జగ దీష్, డా.తనుగుల జీతేందర్ రావు, వంశీ రామరాజు, తాటికొండ పట్టాబి తదితత రులు పాల్గొంటారని తెలిపారు. శ్రుతి లయ వ్యవస్థాపక కార్యద ర్శి, గాయనీ ఆమని నిర్వహణలో జంటనగర ప్రముఖ గాయనీగాయకులచే ‘జయ జయహే తెలంగాణ’ గీతం, తెలుగు హిందీ సినీ సంగీత విభావరి నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News