Monday, December 23, 2024

ఈ నెల 29న బిసిల విస్తృతస్థాయి సమావేశం

- Advertisement -
- Advertisement -

బిసిల భవిష్యత్ కార్యాచరణపై రాజకీయ విధానం: జాజుల శ్రీనివాస్ గౌడ్

మన తెలంగాణ / హైదరాబాద్ : ఈనెల 29న హైదరాబాద్‌లో బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశం జరుగనుంది. ఈ సమావేశంలో బిసిల భవిష్యత్ రాజకీయ కార్యాచరణ పై చర్చించి రాజకీయ విధానం ప్రకటించనున్నట్లు ఆ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో బిసిలకు జనాబ దామాషా ప్రకారం 60 అసెంబ్లీ స్థానాలను, ముఖ్యమంత్రి పదవి కావాలనే ప్రధాన డిమాండ్ తో బిసిలు రాజకీయ పోరాటం చేస్తున్నప్పటికీ బిఆర్‌ఎస్, కాంగ్రెస్, బిజెపి పార్టీలు అగ్రకులాలకే రాజకీయ ప్రాధాన్యత కల్పించి, బిసిలను రాజకీయంగా అణిచివేయాలని చూస్తున్నాయని ఆయన ఆరోపించారు.

ఇప్పటివరకు ప్రకటించిన బిఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీల అభ్యర్థుల్లో బిసిలకు తీరని అన్యాయం జరుగుతోందన్నారు, ఈ నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికల్లో బిసిలు అనుసరించాల్సిన రాజకీయ విది,విధానాలపై రాష్ట్ర సమావేశంలో విస్తృతంగా చర్చించి భవిష్యత్ రాజకీయ కార్యాచరణను ఖరారు చేయడానికి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. ఈ సమావేశానికి 33 జిల్లాల నుండి రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, మండల, స్థాయి ముఖ్య స్థాయి నేతలు హాజరుకావాలని శ్రీనివాస్ గౌడ్ పిలుపునిచ్చారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News