Thursday, April 3, 2025

ఫడ్నవీస్ ‘సన్స్ ఆఫ్ ఔరంగజేబ్’ వ్యాఖ్యపై ఓవైసీ చురక!

- Advertisement -
- Advertisement -

కొల్హాపూర్: మహారాష్ట్రలోని కొల్హాపూర్‌లో 17వ శతాబ్దికి చెందిన మొగల్ చక్రవర్తి ఔరంగజేబ్ వివాదాస్పద వ్యాఖ్యల రాజకీయాల కారణంగా ఘర్షణలు తీవ్రతరం అయ్యాయి. కొల్హాపూర్ నగరంలో హింసాత్మక ఘటనలు ముగిశాక మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ‘సన్స్ ఆఫ్ ఔరంగజేబ్’ అని చేసిన వ్యాఖ్యలు కొందరి మనసులను నొప్పించాయి. దానికి మజ్లీస్ పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ ‘అటువంటి సంబంధాలను గుర్తించడంలో బిజెపి నాయకుడు ‘నిపుణుడని’తనకు తెలియదని, మహాత్మా గాంధీ హంతకుడైన నాథూరామ్ గాడ్సే సంతానం అని వారిని పిలవాలని’ ఓవైసీ చురక అంటించారు.

మహారాష్ట్రలోని కొన్ని జిల్లాల్లో అకస్మాత్తుగా ఔరంగజేబు కుమారులు పుట్టారు…వారు ఔరంగజేబు హోదాను, పోస్టర్లను ప్రదర్శించారు. దీనివల్ల అక్కడ ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. ఈ ఔరంగజేబు సంతానం ఎక్కడి నుంచి వస్తోందన్న ప్రశ్న తలెత్తుతోంది. దీని వెనుక ఎవరున్నారు? మేము కనుగొంటాము’ అని ఫడ్నవీస్ నాగపూర్‌లో ఎఎన్‌ఐతో అన్నారు.
ఆయన వ్యాఖ్యలపై ఓవైసీ స్పందిస్తూ ‘మహారాష్ట్ర హోం మంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ‘ఔరంగజేబ్ కే ఔలాద్’ అన్నారు. నీకన్నీ తెలుసా? నువ్వు ఇంత నిపుణుడవని నాకు తెలియదు. అయితే నాథురామ్ గాడ్సే, బాబా సాహెబ్ ఆప్టే సంతానం ఎవరో చెప్పు’అని చురక వేశారు. ప్రస్తుత బిజెపి భావజాలానికి మూలమైన ఆర్‌ఎస్‌ఎస్‌తో గాడ్సేకు సంబంధాలుండేవని అసదుద్దీన్ ఓవైసీ తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News