Wednesday, April 9, 2025

అశోక్ గెహ్లాట్‌పై బిజెపి మండిపాటు

- Advertisement -
- Advertisement -
రాజస్థాన్‌లో ప్రధాని మోడీ ర్యాలీ ఒత్తిడి కారణంగానే రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ఉచిత విద్యుత్తు ప్రకటన చేశారని బిజెపి నాయకులు అంటున్నారు.

జైపూర్: తన పాత ప్రకటననే కొత్తగా మళ్లీ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ప్రకటించారని కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అన్నారు. తొలి 100 యూనిట్ల వరకు విద్యుత్తు బిల్లులను మాఫీ చేయాలని రాజస్థాన్ ప్రభుత్వం నిర్ణయించుకున్నాక ఆయన ఈ విషయం చెప్పారు. ఇదివరకు రాష్ట్ర బడ్జెట్ సందర్భంగా కూడా గెహ్లాట్ ఇలాంటి ప్రకటనే చేశారు. అయితే ఇప్పుడు రాజస్థాన్‌లో ప్రధాని మోడీ ర్యాలీ తర్వాత మళ్లీ ఆ ప్రకటన చేశారు అన్నారు.

‘ఆయనకు రాత్రికి రాత్రే ‘బ్రహ్మ జ్ఞానం’ సిద్ధించింది. అది ఆయనకు ‘ధరల పెరుగుదల నుంచి స్వాంతన శిబిరం’ నుంచి లభించింది. రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వం ఇంధన సర్ ఛార్జీలను యూనిట్‌కు 18 పైసల నుంచి 57 పైసలకు పెంచింది. గత నాలుగు ఏళ్లుగా దాదాపు 40 నుంచి 45 పైసలు యూనిట్‌కు లూటీ చేసింది. వైఫల్యాన్ని ఒప్పుకున్నాక ఇప్పుడు ప్రజలను సంతోషపెట్టడానికి ప్రయత్నిస్తోంది’ అని షెకావత్ ఎఎన్‌ఐ వార్తా సంస్థతో అన్నారు.

తొలి 100 యూనిట్లు వరకు విద్యుత్తు బిల్లును రద్దు చేస్తామని రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ బుధవారం ప్రకటించారు. 100 యూనిట్ల వరకు వినియోగించే వారి బిల్లు సున్నా(0) అన్నారు. ఇంకా ఆయన 200 యూనిట్ల వరకు వినియోగదారుల ఫిక్స్‌డ్ ఛార్జీలు, ఫ్యూయెల్ సర్‌ఛార్జీలు, ఇతర ఛార్జీలను కూడా మాఫీ చేస్తున్నట్లు కూడా ప్రకటించారు.

గమనించాల్సిన విషయం ఏమిటంటే ప్రధాని నరేంద్ర మోడీ రాజస్థాన్‌లో ఎన్నికల సైరన్ మోగించిన కొన్ని గంటలకే, రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనను విమర్శించిన కొన్ని గంటలకే గెహ్లాట్ 100 యూనిట్ల వరకు ఉచిత కరెంటు వసతిని ప్రకటించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News