Thursday, January 23, 2025

బధిరుల డిగ్రీ కాలేజీ ఏర్పాటుపై…

- Advertisement -
- Advertisement -

చైర్మన్ వాసుదేవ రెడ్డితో పరిశీలన బృందం సమావేశం

హైదరాబాద్ : బధిరుల డిగ్రీ కళాశాల ఏర్పాటు కోసం రాష్ట్ర వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ డా.కె.వాసుదేవరెడ్డి తో పరీశీలన బృందం సమావేశమైంది. రాష్ట్రంలో ఉన్న బధిరుల (డిఇఎఎఫ్) విద్యార్ధులకు ప్రత్యేకంగా డిగ్రీ కళాశాల లేనందున వారు ఉన్నత విద్య కు దూరమవడమై ప్రభుత్వ ఉద్యోగాల్లో అవకాశాలు కోల్పోతున్నారు. అందువల్ల రాష్ట్రంలో బధిరుల డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని కోరుతూ రాష్ట్ర వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ డా.కె.వాసుదేవరెడ్డి ఇటీవల ముఖ్యమంత్రి కెసిఆర్‌ని కలిసి వినతి పత్రం సమర్పించారు. ముఖ్యమంత్రి తక్షణమే స్పందించి కళాశాల ఏర్పాటుకు సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

ముఖ్యమంత్రి ఆదేశాలతో మంగళవారం మలక్ పేట వికలాంగుల సంక్షేమ భవన్ లో బధిరుల డిగ్రీ కళాశాల ఏర్పాటు పరీశీలనకు ఖైరతాబాద్ ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపల్ డా.రాజేందర్ ఆధ్వర్యంలో వచ్చిన బృందం చైర్మన్ డా.కె.వాసుదేవరెడ్డిని మర్యాద పూర్వకంగా కలిసింది. కళాశాల ఏర్పాటు, దాని అవసరం తదితర అంశాలపై ఈ సందర్భంగా చర్చ జరిగింది. చైర్మన్ వాసుదేవ రెడ్డి అందించిన సమాచారం, కళాశాల పరీశీలన బృందం చేసిన పరీశీలనపై ప్రభుత్వానికి వీలైనంత త్వరగా నివేదిక ను అందజేస్తామని బృందం సభ్యులు తెలిపారు. అనంతరం చైర్మన్ మాట్లాడుతూ వికలాంగుల సమస్యలపై తెలంగాణ ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తుందన్నారు, ఇటీవల ముఖ్యమంత్రి కెసిఆర్‌ని ప్రత్యేకంగా కలిసి దివ్యంగుల సమస్యలను వివరించానని అందులో భాగంగా బధిరుల డిగ్రీ కళాశాల ఏర్పాటు ఆవశ్యకతను వివరించానని అందుకు స్పందిచిన ముఖ్యమంత్రికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News