Monday, November 25, 2024

విద్యుత్ శాఖపై… చర్చ…రచ్చ

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్: గత పది సంవత్సరాలుగా ఎన్నడూ లేని విధంగా ఈ సంవత్సరం విద్యుత్‌శాఖ ఆస్తులు, అప్పులపై పెద్ద దుమారం లేవడంతో రాష్ట్ర వ్యాప్తంగా సదరు శాఖ పనితీరు చర్చనీయాశంగా మారింది. కాంగ్రేస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ప్రభుత్వం విద్యుత్‌శాఖపై ప్రత్యేక దృష్టి సారించింది. అంతే కాకుండా ఈ పది సంవత్సరాల్లో సదరు శాఖపై ఆదాయ వ్యయాలపై అసెంబ్లీలో ప్రభుత్వం శ్వేత పత్రం కూడా విడుదల చేయగా దానికి ధీటుగా తాము గత 10 సంవత్సరాల్లో విద్యుత్ రంగ అభివృద్దిపై ఒక ప్రత్యేక బుక్‌లెట్‌ను విడుదల చేశారు. అప్పులు చేసినా సంస్థల అభివృద్ధికి పలు ప్రాజెక్టుల నిర్మాణానికి వ్యయం చేయడంతో సంస్థ ఆస్తులను కూడా భారీగా పెంచామని చెబుతూ తామ ఎటువంటి విచారణకైనా సిద్దమే నంటూ సవాల్ విసిరారు.

రాష్ట్రం ఏర్పడేనాటికి 2700 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ లోటునిత్య విద్యుత్ కోతలతో, అభివృద్ధికి నోచుకోని విద్యుత్ రంగంతో తెలంగాణ తలసరి విద్యుత్ వినియోగం 1196 యూనిట్లు మాత్రమే ఉందన్నారు. నాటి పాలకు తెలంగాణ విద్యుత్ అవసరాలకు సరిపడా ఇక్కడ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను నిర్మించడంలో నిర్లక్ష్యం చేశారని గుర్తు చేశారు. సమైక్యరాష్ట్ర పాలనలో సోలార్ పవర్ జనరేషన్ కేంద్రాల ఏర్పాటు పట్ల నిర్లక్ష్యం వహించారన్నారు.

రాష్ట్రం ఏర్పడిన అతి కొద్దికాలంలోనే డిమాండ్ లోటు అధిగమించి కేవలం పట్టణాలలో మాత్రమే కాదు, పల్లెలలోని గృహ, వాణిజ్య, పరిశ్రమల రంగాలకు కూడా 24 గంటల నాణ్యమైన విద్యుత్ సరఫరా చేసుకున్నామన్నారు. రాష్ట్రం ఏర్పడిన తరువాత, అనేక కొత్త విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల నిర్మాణంతో – ‘మిగులు విద్యుత్తు రాష్ట్రం‘ దిశగా అడుగులు వేసిందన్నారు. సోలార్ పవర్ జనరేషన్ లో దేశంలోని అగ్రగామి రాష్ట్రాలలో ఒకటిగా తెలంగాణ నిలిచిందన్నారు. రాష్ట్రం ఏర్పడిన తరువాత కొత్తగా 8.46 లక్షల వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఇచ్చినట్లు తెలిపారు. 27.49 లక్షల వ్యవసాయ పంపుసెట్లకు నాణ్యమైన ఉచిత విద్యుత్ అందిస్తున్న ఏకైక రాష్ట్రం నిలిచిందన్నారు.

రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి జీవనాడి వంటి విద్యుత్ రంగం అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహించి చేపట్టిన చర్యలతో 60 ఏళ్ళ సమైక్య పాలనలో సాధ్యం కాని విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు, సబ్‌స్టేషన్లు, ఏర్పాటు చేసుకున్నామన్నారు.కొత్తగా ఏర్పాటు చేసిన విద్యుత్ లైన్లు, కేంద్రాల ఏర్పాటు ద్వారా రాష్ట్ర తలసరి విద్యుత్ వినియోగం 2140కి చేరిందని, ఇది జాతీయ సగటు (1255 యూనిట్లు) కంటే 70 శాతం అధికమన్నారు. సమైక్య రాష్ట్రంలో నిర్లక్ష్యానికి గురైన 600 మెగావాట్ల కాకతీయ థర్మల్ పవర్ స్టేషన్‌ను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేశామన్నారు. దేశంలోనే తొలిసారిగా రికార్డు సమయంలో (48 నెలలు) పాల్వంచలోని కెటిపిఎస్ 7వ దశ 800 మెగావాట్ల సూపర్ క్రిటికల్ ధర్మల్ కేంద్రం నిర్మాణం పూర్తి చేసుకుని విద్యుదుత్పత్తి ప్రారంభించినట్లు తెలిపారు. సమైక్య రాష్ట్రంలో నిర్లక్ష్యానికి గురైన 2400 మెగావాట్ల లోయర్ జూరాల, 1200 మెగావాట్ల మెగావాట్ల పులిచింతల జలవిద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను కూడా యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసినట్లు గుర్తు చేశారు.అంతే కాకుండా దేశంలోనే మొదటి సారిగా ప్రభుత్వ రంగంలో, నల్గొండ జిల్లాలోని దామెరచెర్లలో రూ.34400 కోట్ల పెట్టుబడితో 4000 మెగావాట్ల యాదాద్రి సూపర్ క్రిటికల్ థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని 2023లో మొదటి యూనిట్ అందుబాటులోకి తెచ్చినట్లు తెలపగా. ప్రభుత్వం విద్యుత్‌శాఖ సరఫరా చేస్తున్న విద్యుత్‌లో 40 శాతం పలు నీటి పారుదల ప్రాజెక్టులకు సరఫరా చేయడం జరుగుతుంది. రాష్ట్ర ఆవిర్భావ సమయం నాటికి రాష్ట్ర ప్రభుత్వ శాఖలు, ఎత్త పోతల పథకాలుకు సంబంధించి విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కంలకు) చెల్లించాల్సిన విద్యుత్ బకాయిలు రూ.1268 కోట్లు ఉండగా అక్టోబర్ 31 నాటికి అవి రూ. 28,861 కోట్లకు చేరాయి. వాటిలో గత ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం లిప్టు విద్యత్ బకాయిలు రూ.14,172 ఉంన్నాయంటూ అధికార కాంగ్రేస్ ప్రభుత్వం నివేదికను విడుదల చేసింది.అధికార ,ప్రతిపక్ష పార్టీల మధ్య ఈ సంవత్సరం విద్యుత్‌శాఖపై పెద్ద ఎత్తున చర్చ జరగడంతో అందరి దృష్టి విద్యుత్‌శాఖపై పడింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News