Sunday, December 22, 2024

మరోసారి భూముల వేలానికి హెచ్‌ఎండిఏ సిద్ధం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్:  మరోసారి భూముల -వేలానికి హెచ్‌ఎండిఏ సిద్ధమైంది. రంగారెడ్డి, మేడ్చల్ – మల్కాజిగిరి, సంగారెడ్డి జిల్లాల్లో భూముల విక్రయానికి నోటిఫికేషన్ జారీ చేసింది. రంగారెడ్డిలోని బైరాగిగూడ, మంచిరేవుల, కోకాపేట, నల్లగండ్ల, బుద్వేల్, చందానగర్, పీరం చెరువు, మేడ్చల్ – మల్కాజిగిరిలోని బాచుపల్లి, బౌరంపేట, చెంగిచెర్ల, సూరారం.. సంగారెడ్డిలో వెలిమల, నందిగాయ, అమీన్‌పూర్, పతిఘనపూర్, కిష్టారెడ్డిపేట ప్రాంతాల్లోని భూములను విక్రయించనుంది. చదరపు గజానికి కనీస ధర రూ.12వేలు, గరిష్ట ధర రూ.65వేలుగా హెచ్‌ఎండిఏ నిర్ణయించింది. ప్లాట్ల విస్తీర్ణం 302 చదరపు గజాల నుంచి 8,591 చదరపు గజాల వరకు ఉన్నాయి. రిజిస్ట్రేషన్ చివరి తేదీ ఆగస్టు 16వ తేదీ కాగా 18వ తేదీ నుంచి ఈ వేలాన్ని నిర్వహించనున్నారు. పూర్తి వివరాలను అధికారిక వెబ్‌సైట్‌లో https://www.hmda. gov.in/ auctions చూడాలని అధికారులు సూచించారు.

రంగారెడ్డి జిల్లాలో భూముల వేల వివరాలు ఇలా…..
రంగారెడ్డి జిల్లాలోని బైరాగిగూడ (సర్వే నెంబర్ 57)లో 2,420 గజాలను వేలం వేయనుండగా గజానికి రూ.35 వేలుగా అధికారులు ధరను నిర్ణయించారు. మంచిరేవుల, గండిపేట్‌లోని (సర్వే నెంబర్ 430)లో 5,082 గజాలను వేలం వేయనుండగా, అక్కడ గజానికి రూ. 50 వేల ధరగా నిర్ణయించారు. పీరంచెరువు, గండిపేట్‌లోని (సర్వే నెంబర్ 44)లో 4,477 గజాలను వేలం వేయనుండగా, అక్కడ గజానికి రూ. 50 వేల ధరగా నిర్ణయించారు. కోకాపేట్, గండిపేట్‌లోని (సర్వే నెంబర్ 144)లో 8,591 గజాలను వేలం వేయనుండగా, అక్కడ గజానికి రూ. 65 వేల ధరగా నిర్ణయించారు. నల్లగండ్ల, శేరిలింగంపల్లిలోని (సర్వే నెంబర్ 161)లో 2,420 గజాలను వేలం వేయనుండగా,

అక్కడ గజానికి రూ. 65 వేల ధరగా నిర్ణయించారు. నల్లగండ్ల, శేరిలింగంపల్లిలోని (సర్వే నెంబర్ 188)లో 4,840 గజాలను వేలం వేయనుండగా, అక్కడ గజానికి రూ. 65 వేల ధరగా నిర్ణయించారు. చందానగర్, శేరిలింగంపల్లిలోని (సర్వే నెంబర్ 174)లో 1,694 గజాలను వేలం వేయనుండగా, అక్కడ గజానికి రూ. 50 వేల ధరగా నిర్ణయించారు. బుద్వేల్, రాజేంద్రనగర్‌లోని (సర్వే నెంబర్ 89)లో 4,356 గజాలను వేలం వేయనుండగా, అక్కడ గజానికి రూ. 50 వేల ధరగా నిర్ణయించారు.
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో భూముల వేల వివరాలు ఇలా…..
బాచుపల్లిలోని (సర్వే నెంబర్ 363)లో 2,299 గజాలను వేలం వేయనుండగా, అక్కడ గజానికి రూ. 30 వేల ధరగా నిర్ణయించారు. బాచుపల్లిలోని (సర్వే నెంబర్ 425)లో 605 గజాలను వేలం వేయనుండగా, అక్కడ గజానికి రూ. 25 వేల ధరగా నిర్ణయించారు. బౌరంపేట్, గండిమైసమ్మ, దుండిగల్ (సర్వే నెంబర్ 694)లో 2,420 గజాలను వేలం వేయనుండగా, అక్కడ గజానికి రూ. 24 వేల ధరగా నిర్ణయించారు. బౌరంపేట్, గండిమైసమ్మ, దుండిగల్ (సర్వే నెంబర్ 130)లో 530 గజాలను వేలం వేయనుండగా, అక్కడ గజానికి రూ. 24 వేల ధరగా నిర్ణయించారు. బౌరంపేట్, గండిమైసమ్మ,

దుండిగల్ (సర్వే నెంబర్ 130)లో 1,500 గజాలను వేలం వేయనుండగా, అక్కడ గజానికి రూ. 24 వేల ధరగా నిర్ణయించారు. బౌరంపేట్, గండిమైసమ్మ, దుండిగల్ (సర్వే నెంబర్ 130)లో 666 గజాలను వేలం వేయనుండగా, అక్కడ గజానికి రూ. 24 వేల ధరగా నిర్ణయించారు. చెంగిచెర్ల, మేడిపల్లి (సర్వే నెంబర్ 33/1)లో 1,210 గజాలను వేలం వేయనుండగా, అక్కడ గజానికి రూ. 20 వేల ధరగా నిర్ణయించారు. సురారం, కుత్భుల్లాపూర్ (సర్వే నెంబర్ 166,167)లో 4,840 గజాలను వేలం వేయనుండగా, అక్కడ గజానికి రూ. 25 వేల ధరగా నిర్ణయించారు.

సంగారెడ్డి జిల్లాలో భూముల వేల వివరాలు ఇలా..
వెలిమల, ఆర్.సిపురం (సర్వే నెంబర్ 507)లో 5,929 గజాలను వేలం వేయనుండగా, అక్కడ గజానికి రూ. 20 వేల ధరగా నిర్ణయించారు. అమీన్‌పూర్ (సర్వే నెంబర్ 823 పి1)లో 514.25 గజాలను వేలం వేయనుండగా, అక్కడ గజానికి రూ. 40 వేల ధరగా నిర్ణయించారు. అమీన్‌పూర్ (సర్వే నెంబర్ 823 పి2)లో 514.25 గజాలను వేలం వేయనుండగా, అక్కడ గజానికి రూ. 40 వేల ధరగా నిర్ణయించారు. అమీన్‌పూర్ (సర్వే నెంబర్ 823 పి3)లో 302.50 గజాలను వేలం వేయనుండగా, అక్కడ గజానికి రూ. 40 వేల ధరగా నిర్ణయించారు. అమీన్‌పూర్ (సర్వే నెంబర్ 250)లో 1452 గజాలను వేలం వేయనుండగా, అక్కడ గజానికి రూ. 40 వేల ధరగా నిర్ణయించారు.

వెలిమల, ఆర్‌సిపురం (సర్వే నెంబర్ 227)లో 1210 గజాలను వేలం వేయనుండగా, అక్కడ గజానికి రూ. 15 వేల ధరగా నిర్ణయించారు. రామేశ్వరం బండ, పటాన్‌చెరు (సర్వే నెంబర్ 273)లో 1089 గజాలను వేలం వేయనుండగా, అక్కడ గజానికి రూ. 12 వేల ధరగా నిర్ణయించారు. నందిగామ, పటాన్‌చెరు (సర్వే నెంబర్ 387)లో 1331 గజాలను వేలం వేయనుండగా, అక్కడ గజానికి రూ. 12 వేల ధరగా నిర్ణయించారు. పటాన్‌చెరు (సర్వే నెంబర్ 281)లో 7502 గజాలను వేలం వేయనుండగా, అక్కడ గజానికి రూ. 16 వేల ధరగా నిర్ణయించారు. కిష్టారెడ్డిపేట్, అమీన్‌పూర్ (సర్వే నెంబర్ 177)లో 1452 గజాలను వేలం వేయనుండగా, అక్కడ గజానికి రూ. 18 వేల ధరగా నిర్ణయించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News