బాలికతోపాటు మరో నలుగురు ఆస్పత్రి నుంచి డిశ్చార్జి
పుణె : మహారాష్ట్ర పుణె జిల్లా లోని పింప్రిచించ్‌వాడ్ ఏరియాకు చెందిన ఒమిక్రాన్ బాధితురాలైన ఒకటిన్నర సంవత్సరాల బాలిక ఒమిక్రాన్ నుంచి కోలుకోవడంతో ఆస్పత్రి నుంచి శనివారం డిశ్చార్జి అయింది. ఒమిక్రాన్ సోకిన మరో మూడేళ్ల బాలుడు అసింప్టమేటిక్ లక్షణాలతో ఉన్నట్టు ప్రస్తుతం ఆ బాలుడు క్షేమంగా ఉన్నాడని వైద్యాధికారులు శనివారం తెలిపారు. పింప్రిచించ్‌వాడ్ మున్సిపల్ కార్పొరేషన్ ఏరియాలో ఒమిక్రాన్ సోకిన నలుగురిలో ఈ మూడేళ్ల బాలుడు ఒకరు కాగా, మిగతా ముగ్గురు పెద్దలు. వీరిలో ఇద్దరు పురుషులు, ఒక మహిళ ఉన్నారు. వీరంతా నైజీరియా నుంచి ఇటీవల వచ్చిన భారత సంతతికి చెందిన ఒకామె, ఆమె ఇద్దరు కుమార్తెలతో సన్నిహితంగా ఉండడంతో ఒమిక్రాన్ సోకిందని తెలుస్తోంది.
నైజీరియా నుంచి రాడానికి ముందే వారంతా ఒమిక్రాన్ బాదితులైనట్టు వైద్యాధికారులు పేర్కొన్నారు. నైజీరియా నుంచి ఆమె పింప్రిచించ్‌వాడ్ లోని తన సోదరుడిని కలుసుకోడానికి వచ్చింది. ఆమె , ఆమె ఇద్దరు కుమార్తెలు కాకుండా ఆమె సోదరుడు, అతని ఒకటిన్నర సంవత్సరాల కుమార్తెతోపాటు ఇద్దరు కుమార్తెల్లో ఒమిక్రాన్ పాజిటివ్ కనిపించింది. ఇంతకు ముందు ఒమిక్రాన్ బాధితులైన ఆరుగురిలో ఒకటిన్నర సంవత్సరాల బాలికతో సహా నలుగరు ఒమిక్రాన్ రోగులు ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారని వైద్య వర్గాలు పేర్కొన్నాయ.