Friday, November 22, 2024

పూల కుండీల దొంగలు దొరికారు

- Advertisement -
- Advertisement -

గురుగ్రామ్: జి20 సదస్సును దృష్టిలో పెట్టుకుని నగర సుందరీకరణ కోసం ఏర్పాటు చేసిన పూల కుండీలను చోరీ చేసిన ఒక ప్రాపర్టీ డీలర్‌ను గురుగ్రామ్ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. తస్కరించిన పూల కండీలను రవాణా చేసేందుకు ఉపయోగించిన ఎస్‌యువిని జప్తు చేయడంతోపాటు 10 పూల కుండీలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని గాంధఋనగర్‌లో నివసించే మన్మోహన్(50)గా పోలీసులు గుర్తించారు.

అఇయతే, పూల కుండీలను తీసుకోవడానికి నిర్దేశిత స్థలం వద్దకు రావాలని గురుగ్రామ్ మెట్రోపాలిటన్ అభివృద్ధి సంస్థ(జిఎండిఎ) అధికారి ఒకరు తనకు ఫోన్ చేశారని మన్మోహన్ చెప్పడంతో ఆ అధికారి గురించి కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ సంఘటనలో పాలుపంచుకున్న జిఎండిఎ అధికారిని కూడా గుర్తించామని పోలీసులు చెప్పారు. జిఎండిఎ జనరల్ మేనేజర్ నవాబ్ సింగ్‌గా గుర్తించామని, ఆయనను కూడా త్వరలోనే అరెస్టు చేస్తామని పోలీసులు చెప్పారు.

ఇదిలా ఉండగా ఈ కేసులో నవాబ్ సింగ్ పేరు రావడంతో ఆయనను పదవి నుంచి బర్తరఫ్ చేసినట్లు తెలిసింది. నవాబ్ సింగ్, మరో వ్యక్తి కలసి తమ లగ్జరీ కారులో పూల కుండీలను చౌర్యం చేసి తీసుకువెళుతున్న వీడియో వైరల్ కావడంతో పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News