Wednesday, January 22, 2025

గ్రామీణ బ్యాంకులో చోరీ.. ఒకరు అరెస్ట్

- Advertisement -
- Advertisement -

One arrested in case of robbery in Gramin Bank

మెండోరా: నిజామాబాద్ జిల్లా మెండోరా మండలంలోని గ్రామీణ బ్యాంకులో చోరీ కేసులో ఒకరిని పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. జులై 12న బ్యాంకులో పదకొండు మంది నిందితులు 8 కిలోల బంగారాన్ని చోరీ చేశారు. ఈ కేసులో మహారాష్ట్రలోని నాగ్ పూర్ లో ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి వద్ద నుంచి 11.6 తులాల బంగారం, సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. నిందితులంతా ఉత్తరప్రదేశ్ కు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం మిగిలిన నిందితుల కోసం విచారిస్తున్నామని పోలీసులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News