Monday, December 23, 2024

ఒక్క సీసీ కెమెరా వంద మంది కానిస్టేబుళ్లతో సమానం

- Advertisement -
- Advertisement -

 

సిద్దిపేటట : ఒక్క సీసీ కెమెరా వంద మంది కానిస్టేబుళ్లతో సమానమని అడిషనల్ డిసిపి అడ్మిన్ మహేందర్ అన్నారు. మంగళవారం కమిషనర్ కార్యాలయంలో సీసీ కెమెరాల పర్యవేక్షణ , ఇన్‌పుట్ , ఆవుట్ పుట్, ఎన్విఆర్ , డివిఆర్ తదితర అంశాల గురించి వాటి పనితీరు గురించి ఒకరోజు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… పెరుగుతున్న టెక్నాలజీని అందిపుచ్చుకోవాలని ఎప్పటికప్పుడు నేర్చుకోడం రోజు రోజుకు పెరుగుతున్న టెక్నాలజీ గురించి తెలసుకోవడం పోలీస్ విధి నిర్వహణలో చాలా ముఖ్యమన్నారు. పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న కో ఆర్టీనేటర్లు పట్టణాల్లో గ్రామాల్లతో ఉన్న సీసీ కెమెరాలను చెక్ చేసుకోవలన్నారు. రిస్టోర్, బ్యాకప్, తదితర అంశాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు.

ప్రతి గ్రామంలో సీసీ కెమెరాల ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ప్రతి రోజు సంబంధిత ప్రజాప్రతినిధులతో గ్రామ పంచాయతీ సిబ్బందితో సీసీ కెమెరాలు ఎలా పని చేస్తున్నాయో మానిటర్ చేయాలన్నారు. సీసీ కెమెరాల వెండర్‌తో మాట్లాడి సీసీ కెమెరాలు పనితీరు గురించి అవగాహన కలిగి ఉండాలన్నారు. సీసీ కెమెరాలు ఉన్న గ్రామాలలో నేరలు తగ్గు ముఖం పట్టడం జరుగుందన్నారు. ప్రతి నెల సీసీ కెమెరాల కోఆర్డినేటర్ శిక్షణ ఇవ్వాలని జిల్లా సీసీ కెమెరాల కోఆర్డినేటర్ పరందాములుకు సూచించారు. సీసీ కెమెరాల వల్ల ఎన్నో ముఖ్యమైన కేసులను జిల్లాలో చేధించడం జరిగిందని ఆయన తెలిపారు. పని చేయని సీసీ కెమెరాలను స్ధానిక ప్రజలు, ప్రజాప్రతినిధుల సహాకారంతో వెంటనే సీసీ కెమెరాల వెండర్ మాట్లాడి సీసీ కెమెరాల రిపేర్ చేయించాలని సూచించారు.

సీసీ కెమెరాల కంట్రోల్ రూల్‌లో పోలీస్ సిబ్బంది 24 గంటలు పని చేయడం జరుగుతుందన్నారు. గ్రామాల్లో పట్టణాలలో సీసీ కెమెరాల గురించి ప్రతి రోజు మానిటర్ చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గజ్వేల్ ఎసీపీ రమేశ్, సిసిఆర్బి ఎసిపి చంద్రశేఖర్, ఐటిసెల్ ఎస్‌ఐ శ్రీకాంత్, సీసీ కెమెరాల జిల్లా కోఆర్డినేటర్లు పరందాములు, జగన్, వివిధ పోలీస్ స్టేషన్ల సీసీ కెమెరాల కోఆర్డినేటర్లు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News