Thursday, January 23, 2025

చెరువులో దూకి ఒకరి ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

లింగంపేట్ : భూమి గొడవల కారణంగా వ్యక్తి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన లింగంపేట్ మండలం ఎక్కపల్లి గ్రామంలో చోటుచే సుకుంది.ఎస్సై శంకర్ తెలిపిన వివరాల ప్రకారం… గ్రామానికి చెందిన ఈరన్న సాయిలు (26) అనే వ్యక్తి గురువారం గ్రామ సమీపంలోని పల్ చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈరన్న రాములుకు ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆస్తి విషయం లో ఇద్దరు తరుచూ గొడవ పడుతుండేవారని మృతుడు అతని భార్య లావణ్య ఈ నెల12 న పర్మల్ల గ్రామంలో బందువుల ఇంటికి వెళ్లారని అక్కడ భార్యభర్తల మద్య పొలంకు సంభందించిన పట్టాపాస్ పుస్తకం విషయంలో గొడవ జరిగిందన్నారు. ఈ విషయంలో బావమరిది రాజేష్, వదిన కిష్టవ్వ నక్క సాయిలుతో పాటు భార్య లావ ణ్య సాయిలును కొట్టి ద్విచక్రవాహనం లాక్కుని ఇంటికి పంపించేశారు. ఇంటికి వచ్చిన సాయిలు కుల పెద్లు ఎల్లన్న, ఎల్లయ్య లకు తన బాదను వివరించారు. ఈ క్రమంలో మస్తాపానికి గురైన సాయిలు సాయంత్ర ం పల్ చెరువులో దూకి ఆత్మ హత్య చేసుకున్నట్లు ఎస్సై తెలిపారు. తక్ష కొడుకు మృతి కారణమైన నలుగురిపై చ్యలు తీసుకోవాలని మృతుడి తండ్రి ఫిర్యాదులో పేర్కొన్నాడు. కేసు నమోదు చేసుకున దార్యప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News