Sunday, February 2, 2025

ఒకే దేశం-ఒకే ఎన్నికలు అంశంపై కమిటీ….

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఒకే దేశం-ఒకే ఎన్నికలు అంశంపై మాజీ రాష్ట్రపతి కోవింద్ నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేయనున్నారు. ఒకే దేశం-ఒకే ఎన్నికలకు అవకాశాలను రామ్‌నాథ్ కోవింద్ కమిటీ పరిశీలించనున్నారు. రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలో ప్రభుత్వం ఈ కమిటీని ఏర్పాటు చేసింది.  పార్లమెంట్ సమావేశాలు ఐదు రోజుల పాటు నిర్వహిస్తామని పార్లమెంట్ వ్యవహారాల శాఖ సమాచారం ఇవ్వడంతో ప్రతిపక్ష పార్టీల్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. జమిలి ఎన్నికల నిర్వహించాలని మోడీ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని రాజకీయ ప్రముఖలు అభిప్రాయపడుతున్నారు. లోక్ సభను రద్దు చేసే ముందస్తు ఎన్నికలకు వెళ్లే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నట్టు సమాచారం. లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి జరపాలని పలుమార్లు పిఎం మోడీ ప్రస్తావించారు.

Also Read: మేక తెచ్చిన తంటా…. మర్మాంగాన్ని కొరికిన పక్కింటి వ్యక్తి

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News