Saturday, April 26, 2025

మేడారం జాతరకు కోటి మందిపైగా భక్తులు హాజరవుతారు: సిఎస్

- Advertisement -
- Advertisement -

One Crore devotees attended Medaram jatara

 

హైదరాబాద్: ఈ నెల 16 నుంచి 19 వరకు మేడారం జాతర నిర్వహిస్తామని సిఎస్ సోమేష్ కుమార్ తెలిపారు. మేడారం జాతర ఏర్పాట్లపై అధికారులతో సిఎస్ సోమేష్ కుమార్, డిజిపి మహేందర్ రెడ్డి టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. టెలీకాన్ఫరెన్స్‌లో అన్ని శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. మేడారం జాతర కోసం అన్ని ఏర్పాట్లను చేశామన్నారు. అన్ని శాఖల సమన్వయంతోనే పని చేయాలని సూచించారు. ఈ జాతరకు కోటి మందిపైగా భక్తులు హాజరవుతారని అంచనా వేస్తున్నామన్నారు. మేడారంలో ప్రధాన ఆస్పత్రిలో పాటు 35 హెల్త్ క్యాంప్‌లు ఏర్పాటు చేశామని సిఎస్ తెలిపారు. 327 ప్రాంతాల్లో 6700 టాయిలెట్ల నిర్మాణం, స్నాన ఘట్టాలు ఏర్పాటు చేశామన్నారు. భక్తుల సౌకర్యార్థం ఆర్‌టిసి ద్వారా 3850 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశామన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News