మనతెలంగాణ/హైదరాబాద్: నివారింపదగ్గ అంధత్వ రహిత తెలంగాణ లక్ష్యం ని నాదంతో రాష్ట్రంలో ప్రారంభించిన కంటి వెలుగు కా ర్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా విజయవంతంగా కొనసాగుతున్నది. 49 పని దినాల్లో ఇప్పటి వరకు కోటి మందికి పైగా కంటి పరీక్షలు పూర్తయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా గురువారం నాటికి ఒక కోటి ఒక లక్ష 65 వేల 529 మంది కంటి పరీక్షలు చేయించుకున్నారు. అం దులో 47,70,757 మంది పురుషులు ఉండగా, 53,85,293 మంది మహిళలు, 3,360 మంది ట్రాన్స్‌జెండర్లు ఉన్నారు. రెండో విడత కంటి వెలుగు కార్యక్రమంలో భాగంగా మొత్తం 16,33,988 మం దికి కంటి అద్దాలు పంపిణీ చేశారు.
12,31,523 మందికి ప్రిస్కిప్షన్ గ్లాసెస్ కోసం గుర్తించారు. 72,99,858 లక్షల మందికి ఎలాంటి కంటి సమస్య లు లేవని నిర్ధారణ అయ్యింది. గత జనవరి 18న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు చేతుల మీదుగా ప్రారంభమైన కంటి వెలుగు కార్యక్రమం ప్రజల కంటి సమస్యలను దూరం చేస్తున్నది. దృష్టి లోపాలు సవరించేందుకు 2018, ఆగస్టు 15న తొలి విడుత కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించారు. మెదక్ జిల్లా మల్కాపూర్‌లో ప్రారంభించిన ఈ కార్యక్రమం 8 నెలల పాటు కొనసాగింది. కోటి 50 లక్షల మందికి ఉచితంగా కంటి పరీక్షల నిర్వహించి, 50 లక్షల కళ్లద్దాలను పంపిణీ చేశారు. అదే స్ఫూర్తితో రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని గత జనవరి 18 న ఖమ్మంలో ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రారంభించగా, అనుకున్న లక్ష్యం మేరకు ఈ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతున్నది.
49 పనిదినాల్లో 64.07 శాతం మందికి కంటి పరీక్షలు చేయడం పూర్తయ్యాయి. లక్షంగా నిర్దేశించుక్న్న 100 పనిదినాల్లో రాష్ట్రంలో అందరికి పరీక్షలు పూర్తి చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. కంటి వెలుగు సమయంలో ఇతర వైద్య సేవలకు అంతరాయం లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వైద్య శాఖ, పంచాయతీ రాజ్, మున్సిపల్, ఇతర శాఖలు సహా, అందరు ప్రజాప్రతినిధులు ఇందులో భాగస్వామ్యం అవుతున్నారు. పర్యవేక్షణకు గాను రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో క్వాలిటీ కంట్రోల్ టీంలను ఏర్పాటు చేసి ప్రభుత్వం మానిటరింగ్ చేస్తున్నది. ఇదేవిధంగా కంటివెలుగు కార్యక్రమం కొనసాగితే 2 కోట్ల మందికి కంటివెలుగు పరీక్షలు నిర్వహించే అవకాశం ఉన్నది. దేశంలో ఇప్పటి వరకు ఏ రాష్ట్రం చేపట్టని కంటివెలుగు కార్యక్రమం తెలంగాణ ప్రభుత్వం నిర్వహించడం గర్వంగా ఉందని అధికారులు పేర్కొన్నారు.