Wednesday, January 22, 2025

26న కోటి మొక్కలు నాటేందుకు కార్యాచరణ

- Advertisement -
- Advertisement -

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి

మనతెలంగాణ/ హైదరాబాద్ : స్వాతంత్య్ర వజ్రోత్సవ వేడుకల ముగింపు వేడుకల సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ఆగస్టు 26న కోటి మొక్కలు నాటేందుకు ప్రభుత్వం నిర్ణయించిందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి వెల్లడించారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర స్థాయి ఉన్నత అధికారులతో కలిసి ఆసరా పింఛన్, తెలంగాణకు హరితహారం, గృహలక్ష్మి, ఇంటి పట్టాల పంపిణీ, జీఓ 59, నోటరి భూముల క్రమబద్ధీకరణ, బిసి, మైనారిటీ లకు లక్ష ఆర్థిక సహాయం, గొర్రెల పంపిణీ, దళిత బంధు వంటి పలు అంశాల పై జిల్లా కలెక్టర్ లతో వీడియో సమావేశం నిర్వహించి సమీక్షించారు.

ఈ సందర్భంగా శాంతికుమారి మాట్లాడుతూ ప్రతి జిల్లాకు కేటాయించిన లక్ష్యం ప్రకారం మొక్కలు నాటేందుకు స్థలాలు గుర్తింపు, గుంతల తవ్వకం చేపట్టాలని, ఆగస్టు 26న జరిగే ప్లాంటేషన్ లో ప్రజాప్రతినిధులు, , వివిధ వర్గాల ప్రజలను భాగస్వామ్యం చేస్తూ విజయవంతం చేయాలని సిఎస్ ఆదేశించారు. ప్రణాళికాబద్ధంగా ప్రభుత్వ కార్యక్రమాలను సత్వరమే అమలు చేయాలని సూచించారు. నీటి పారుదల శాఖ పరిధిలోని భూములలో ఏర్పాటు చేస్తున్న సంపద వనాలలో లక్ష్యం మేరకు మొక్కలు నాటే ప్రక్రియ 2 వారాల్లో పూర్తి చేయాలని సిఎస్ సూచించారు. జిల్లాలో హరితహారం క్రింద మొక్కలు నాటడంతో పాటు మొక్కల సంరక్షణకు చర్యలు తీసుకోవాలని, నాటిన ప్రతి మొక్కకు జియో ట్యాగింగ్ చేయాలని సిఎస్ తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News