Wednesday, January 22, 2025

ఒక్కరోజు తహశీల్దార్​గా శ్రీధర్

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/ నాగిరెడ్డిపేట్: నాగిరెడ్డిపేట్ మండలం తహశీల్దార్ గా భీంగల్ నుండి బదిలీపై వచ్చిన బి శ్రీధర్ మంగళవారం ఉదయం నాగిరెడ్డిపేట్ మండలం తహశీల్దార్ గా బాధ్యతలు స్వీకరించి సాయంత్రం ఐదు గంటలకు డిప్యూటి తహశీల్దార్ రాందాస్ కు బాధ్యతలు అప్పజెప్పి వెళ్లిపోయారు. మహ్మద్ సయ్యద్ మస్రూర్ సోమవారం బదిలీపై కామారెడ్డి జిల్లా కార్యాలయానికి వెళ్లారు. డిప్యూటి తహశీల్దార్ రాందాస్ కు బాధ్యతలు అప్పజెప్పారు. మంగళవారం ఉదయం శ్రీధర్ వచ్చి బాధ్యతలు స్వీకరించి సాయంత్రం వెళ్లిపోయారు. బదిలీపై నాగిరెడ్డిపేట్‌కు వచ్చిన బి శ్రీధర్ ఆర్డిఒ గా పదోన్నతి రావడంతో హైదరాబాద్‌కు వెళ్లినట్లు రెవెన్యూ అధికారులు తెలిపారు.

Also Read: వంతెన కట్టకపోతే ఎన్నికల బహిష్కరణ

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News